
అపరాజిత: నీలం, తెలుపు రంగు పువ్వులు పూసే అపరాజిత మొక్క విష్ణుమూర్తికి, శివునికి ఎంతో ఇష్టమైనది. వర్షపు నీటికి అపరాజిత తీగలు త్వరగా అల్లుకుంటాయి. ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మనీ ప్లాంట్: ఆర్థిక వృద్ధికి, ఐశ్వర్యానికి సంకేతంగా భావించే మనీ ప్లాంట్‌ను వర్షాకాలంలో సులభంగా పెంచవచ్చు. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మరియు కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు.

పారిజాతం / హర్‌సింగార్: పారిజాతం పువ్వులు సువాసనకు, పవిత్రతకు ప్రసిద్ధి. పాలసముద్ర మథనం నుంచి ఉద్భవించిన ఈ వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైనది. వర్షాకాలంలో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటి పరిసరాల్లో ప్రతికూల శక్తి తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుంది.

శమి మొక్క: శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది శమి మొక్క. జాతకంలో శని దోషాలు ఉన్నవారు వర్షాకాలంలో శమి మొక్కను నాటి ప్రతిరోజూ పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది రాహు-కేతు దోషాలను నివారించి ఇంట్లో శాంతి, సౌఖ్యాలను నింపుతుందని నమ్ముతారు.

తులసి: భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వర్షాకాలంలో తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల నిరంతరం స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడమే కాకుండా ఇంటికి శ్రేయస్సు చేకూరుతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రతిరోజూ తులసి కోట వద్ద దీపం వెలిగించడం శుభప్రదం.