
రీసెట్ బటన్ నొక్కడానికి: వైఫై రూటర్లు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా సెట్ టాప్ బాక్స్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో రీసెట్ బటన్ చాలా చిన్న రంధ్రం లోపల దాగి ఉంటుంది. వేళ్లతో ఆ బటన్‌ను నొక్కడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో సిమ్ ఎజెక్టర్ పిన్ పర్ఫెక్ట్ టూల్‌గా పనిచేస్తుంది. ఆ చిన్న రంధ్రంలోకి పిన్‌ను సున్నితంగా నెట్టి, రూటర్‌ను సెకన్లలో రీసెట్ చేయవచ్చు.

ఛార్జింగ్ పోర్ట్ శుభ్రం చేయడానికి: చాలాసార్లు ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకపోవడానికి కారణం ఛార్జింగ్ పోర్ట్‌లో లేదా హెడ్‌ఫోన్ జాక్‌లో దుమ్ము, దూది చెత్త పేరుకుపోవడమే. అయితే సూదులు లేదా పదునైన మెటల్ వస్తువులతో క్లీన్ చేస్తే లోపలి పిన్స్ పాడయ్యే ప్రమాదం ఉంది. కానీ సిమ్ ఎజెక్టర్ పిన్ చివర గుండ్రంగా ఉండటం వల్ల, చాలా జాగ్రత్తగా ఛార్జింగ్ పోర్ట్ లోపల ఉన్న దుమ్మును సులువుగా బయటకు తీయవచ్చు.

కెమెరాలు, చిన్న పరికరాలను క్లీన్ చేసేందుకు: స్మార్ట్‌ఫోన్ స్పీకర్ గ్రిల్స్, ఇయర్ ఫోన్స్ లేదా స్పష్టమైన ఫోటోలు రాకుండా కెమెరా లెన్స్ అంచుల చుట్టూ పేరుకుపోయే మురికిని తొలగించడానికి ఈ పిన్ సహాయపడుతుంది. పిన్ చివర కొద్దిగా దూదిని చుట్టి, ఫోన్ మైక్రోఫోన్ మరియు స్పీకర్ రంధ్రాలలో పేరుకుపోయిన సన్నని ధూళిని క్లీన్ చేయవచ్చు.

ఎమర్జెన్సీ టూల్: మీ జాకెట్, బ్యాగ్ లేదా ప్యాంట్ జిప్పర్ హ్యాండిల్ విరిగిపోయి ఇబ్బంది పడుతున్నారా? అలాంటి అత్యవసర సమయాల్లో సిమ్ ఎజెక్టర్ పిన్ ఒక అద్భుతమైన తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగపడుతుంది. విరిగిన జిప్పర్ రంధ్రంలోకి ఈ పిన్‌ను తొడిగి, సులువుగా జిప్ వేసుకోవచ్చు లేదా తీయవచ్చు.

కీచైన్‌గా లేదా ప్రయాణాల్లో పేపర్ క్లిప్‌గా: సిమ్ ఎజెక్టర్ పిన్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది. దీనివల్ల మీరు దీనిని మీ ఇంటి లేదా బైక్ తాళాల గుత్తికి సులువుగా తగలించుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైన చిన్న చిన్న పేపర్లను, టిక్కెట్లను కలిపి ఉంచడానికి పేపర్ క్లిప్‌గా కూడా దీనిని వాడవచ్చు. ఎంతోమంది కేవలం సిమ్ ట్రే కోసమే వాడి పక్కన పడేసే ఈ చిన్న మెటల్ పిన్.. అత్యవసర సమయాల్లో హెల్ప్‌ఫుల్ మల్టీ టూల్‌గా పనిచేస్తుంది. కాబట్టి వచ్చేసారి ఫోన్ బాక్స్‌లో పిన్ కనిపిస్తే దాన్ని పడేయకుండా మీ తాళాల గుత్తికి లేదా పర్స్ లోపల భద్రంగా ఉంచుకోండి.