
చర్మం బిగుతుగా: చల్లటి నీరు చర్మ రంధ్రాలను తాత్కాలికంగా బిగుతుగా చేస్తుంది. దీనివల్ల మురికి, నూనె రంధ్రాలలో పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఫలితంగా చర్మం మరింత మృదువుగా కనిపిస్తుంది.

తక్షణ శక్తి, ఉత్సాహం: ముఖంపై చల్లటి నీటి షాక్ తగలగానే, శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.నరాలు ఉత్తేజితమవుతాయి. ఇది నిద్ర మత్తును త్వరగా తొలగించి.. తక్షణమే మేల్కొలపడానికి, రోజంతా ఉల్లాసంగా ఉండటానికి సహాయపడుతుంది.

వాపును తగ్గిస్తుంది: చల్లని నీరు కళ్ల కింద వాపు, తేలికపాటి ఎరుపుదనాన్ని తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని రక్త నాళాలను తాత్కాలికంగా సంకోచింపజేసి వాపును తక్షణమే తగ్గిస్తుంది.

చర్మపు సహజ నూనెలు: వేడి నీరు చర్మం సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. అయితే, చల్లటి నీరు ఆ నూనెలను సంరక్షిస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా నిరోధించడానికి మరియు ఆరోగ్యంగా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

సహజమైన మెరుపు : చల్లటి నీటిని ముఖంపై ఉపయోగించినప్పుడు, రక్త ప్రసరణ తక్షణమే పెరుగుతుంది. ఈ మెరుగైన రక్త ప్రవాహం చర్మానికి సహజమైన గులాబీ మెరుపును ఇస్తుంది. రోజంతా తాజాగా, కాంతివంతంగా కనిపించడంలో సహాయపడుతుంది.