
Drinking Water: సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజుకు కనీసం 2 లీటర్ల మంచినీళ్లు తాగడం తప్పనిసరి. అయితే 3 సందర్భాల్లో నీరుని తాగకూడదు. అవేమిటంటే..

నిద్రపోయే ముందు: నిపుణుల ప్రకారం నిద్రించే ముందు మంచినీరు తాగకూడదు. ఒక వేళ తాగిన పరిమితిగా తాగాలి తప్ప ఒకే పనిగా తాగేయకూడదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రాత్రి సమయంలో మూత్రపిండాల పనితీరు మందకోడిగా ఉంటుంది. ఈ సమయంలోనే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే దాని ప్రభావం ముఖం మీద వాపులుగా మారే అవకాశం ఉంది.

వ్యాయమాలు: వ్యాయామాలు చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో నీరు తాగితే ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి.. ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంది. కనుక వ్యాయామాలు చేసిన 20, 25 నిముషాల వరకు నీళ్లు తాగకూడదు.

ఆహార సమయం: ఆహారం తీసుకునే అరగంట ముందు, తర్వాత కూడా మంచి నీళ్లు తాగకూడదు. అలా తాగితే శరీర జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఫలితంగా పేగుల పనితీరు కూడా మందగించి ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

అలాగే శరీర అవసరానికి మించిన లేదా అతిగా నీరు తాగడం కూడా మంచిది కాదు. అతిగా నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధులతో పాటు మూత్ర పిండాల పనితీరుపై కూడా చెడు ప్రభావం పడుతుంది.