5 / 5
ఆగస్టు 2న జీఎస్టీ కౌన్సిల్ 51వ సమావేశం జరిగిందది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినో, గుర్రపు పందాలపై పన్ను రేటుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడింది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం పన్ను విధింపు నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది 6 నెలల తర్వాత సమీక్షించబడుతుంది.