నవమి వేళ రామయ్యకు కందిపప్పు పాయసంతో నైవేథ్యం.. మీ ఇంట శుభములు ఖాయం

Updated on: Mar 25, 2026 | 6:03 PM

Sri Rama Navami 2026: శ్రీరామనవమి రోజు ఉదయాన్నే దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పిస్తుంటారు. అయితే, ఈ సారి కందిపప్పు పాయసం చేసి దేవుడి వద్ద పెట్టండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : కప్పున్నర బియ్యం, ఒక కప్పు నానబెట్టిన కందిపప్పు,  నాలుగు కప్పుల మిల్క్, 150 గ్రాముల తురిమిన బెల్లం, జీడిపప్పులు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టీ స్పూన్ నెయ్యి, 10 బాదం పప్పులు , 10 కిస్ మిస్ లు తీసుకోవాలి.

2 / 5

ముందుగా 30 నిముషాల ముందు కంది పప్పును తీసుకుని బాగా నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా తీసుకుని రెండు సార్లు కడిగి బాగా తీసుకుని ఒక ప్లేట్ కానీ గిన్నెలో కానీ పెట్టుకోవాలి. ఇక  ఇప్పుడు బెల్లాన్ని తీసుకుని సన్నగా తురుముకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్యాస్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టి మూడు కప్పుల పాలు పోసి మరిగించాలి. ఆ తర్వాత  ముందుగా తురుముకున్న బెల్లం, యాలకుల పొడి వేసి గరిటేతో బాగా కలుపుతూ మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి.

4 / 5
పాలు మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న కంది పప్పు వేసి సన్నని మంట మీద ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. కందిపప్పు పాయసంలాగా అయ్యే వరకు వరకు పొయ్యి మీదే ఉంచాలి.

5 / 5
బియ్యం, కందిపప్పు మెత్తగా ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టి  రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అది బాగా కాగిన తర్వాత బాదం పప్పులు,  కిస్‌మిస్‌లను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి కందిపప్పు పాయసం రెడీ.

Follow Us