
TVS iQube Electric Scooter: పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దేశంలో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల స్కూటర్లు విడుదల కాగా, ఇక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్.. తన సరికొత్త ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

సింగిల్ చార్జ్‌తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.98,564 నుంచి రూ.1,08,690 వరకు ఉండనుంది. మూడు రకాలైన ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీలలో లభించనున్నది.

కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. ఒలా ఎలక్ట్రిక్, ఏథర్ ఏనర్జీ, హీరో ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ ఈవీలకు పోటీగా సంస్థ ఈ స్కూటర్లను పరిచయం చేసింది. ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు 3.5 గంటల నుంచి 4.5 గంటల లోపు బ్యాటరీ పూర్తిగా రీచార్జి కానున్నది.

ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా వాహనాల తయారీ కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించేలా వాహనాలను రూపొందిస్తున్నాయి కంపెనీలు.