- Telugu News Photo Gallery 153 year old Mandua house in Ambedkar Konaseema district are now modernized as Resort
Mandua Resort: శుభకార్యాలకు వేదికగా మండువా లోగిలి.. యువకుడి ఐడియా అదుర్స్! ఫొటోలు వైరల్
పూర్వం మండువా ఇల్లు అంటే ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహ ద్వారమూ, లోపలికి ఆహ్వానించే అరుగూ, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులూ, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు ... ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో..
Updated on: Nov 27, 2025 | 5:45 PM

పూర్వం మండువా ఇల్లు అంటే ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహ ద్వారమూ, లోపలికి ఆహ్వానించే అరుగూ, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులూ, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు ... ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో.

కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే ఈ మండువా లోగిళ్లు ప్రస్తుతం ఈతరం వారి మనసునూ దోచేస్తున్నాయి. కుటుంబ నేపథ్యం, పల్లె అందాల్ని చూపించే సినిమాల్లో కనిపిస్తూ- పాత తరాల జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్న ఈ మండువా లోగిలి... ఇప్పుడు నిజమైన అనుభూతినీ అందిస్తోంది. ఆధునిక నిర్మాణాల్లోనూ భాగమైపోతూ, వేడుకలెన్నింటికో వేదికై అలనాటి స్మృతుల్లోకి తీసుకెళ్తుంది. అయితే నేడు మండువా లోగిలిని మెయింటెన్ చేయలేక కూల్చి వేసి డూప్లెక్స్ బిల్డింగ్‌లు నిర్మించుకుంటున్నారు.

కొమ్ముల బాలు అనే ఇంజినీరింగ్ యువకుడు మాత్రం తన ముత్తాతలు కాలం నాటి లోగిలిని కూల్చడం ఇష్టంలేక 'మా మండువా' అని పేరు పెట్టి నూతన హంగులతో రిసార్ట్స్ నడుపుతున్నాడు. ఇతను చేసిన ప్రయత్నానాన్ని దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులు అభినందిస్తున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలోని దాదాపు 153 ఏళ్లనాటి మండువా లోగిలి అధునాతన హంగులతో నాటి సంప్రదాయాలకు అనుగుణంగా చూడచక్కగా రూపుదిద్దుకుంది. పూర్వకాలం నాటి తిరగల్లు, రుబ్బురోలు, రోకళ్ళు, జాడీలు, మాను పెట్టెలు అక్కడ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాదించే ఔత్సాహికులు అనేకమంది అక్కడి మండువా లోగిలి వీక్షించడమే కాకుండా అందులో వివాహాలు, పలు రకాల ఫంక్షన్లను చక్కగా జరుపుకుంటున్నారు.




