
గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వానలు బాగా పడుతున్నాయి వీటితో పాటు గాలి కూడా విపరీతంగా వస్తుంది. ఆ దెబ్బకు చెట్లు నేలకొరుగుతున్నాయి కొన్ని చోట్ల కరెంట్ కూడా నిలిచిపోయింది. మార్కాపురంజిల్లాలో గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన పడింది. మిట్టపాలెం దగ్గర రోడ్డు పై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో త్రిపురాంతకం యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

గిద్దలూరులో 120 ఏళ్ళ దేవతా వృక్షలుగా పిలుచుకునే రావి, వేపచెట్లు నేలకొరిగాయి.మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని భారీ వృక్షలు ఈదురు గాలులకు నేలకొరిగాయి.

120 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రావి, వేపచెట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలియాయి. ఘటన చోటు చేసుకున్న సమయంలో భక్తులు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలిపారు.

120 సంవత్సరాల క్రితం రావిచెట్టు, వేప చెట్టు ఆలయ ప్రాంగణంలో పెన వేసుకుని పుట్టాయి. అప్పటినుంచి శివపార్వతులు వల్లే భావించి భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా భారీ వృక్షం నేలకొరకడంతో ప్రజలు ఆశుభం గా భావిస్తున్నారు.