Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

మరో సారి అందరి మనసులను గెలుచుకున్న ఇస్రో చైర్మన్..!

Passengers welcome Isro chief with loud cheers on flight.. Video Goes Viral, మరో సారి అందరి మనసులను గెలుచుకున్న ఇస్రో చైర్మన్..!

ఇస్రో చైర్మన్ కే.శివన్.. ఈ పేరు ఇప్పుడు తెలియని వారు ఉండరు. చంద్రయాన్-2 ప్రయోగంతో ఆయన దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యారు. ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ దేశ ప్రజలకు ఎంత చేరువైందంటే.. తాజాగా జరిగిన ఓ సంఘటన అందుకు నిదర్శనమిచ్చింది.
సాధారణంగా సినిమా హీరోలు, క్రికెటర్లు, పెద్ద పెద్ద రాజకీయ నేతలు కనిపిస్తే ఫోటోలు దిగేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. కానీ అందకు భిన్నంగా జరిగింది కే.శివన్ విషయంలో. ఓ విమానంలో వెళ్లేందుకు వచ్చిన ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌కు అందులోని ప్రయాణికులంతా ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసిన వెంటనే కేరింతలు, కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అంతేకాదు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే ఈ ఊహించని అనుభవానికి శివన్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ జరిగిన సంఘటనను మొత్తం ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే క్షణాల్లో వీడియో వైరల్‌గా మారింది. ఇస్రో చైర్మన్‌ అంతటి వ్యక్తి ఎకానమి క్లాసులో తమ మధ్య ప్రయాణించడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విమాన సిబ్బందితో పాటు పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అందరితోనూ ఓపిగ్గా సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ఆయన నిరాడంబరత, అణుకువతో మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు.

చంద్రయాణ్ 2 ల్యాండర్‌లో ఇబ్బందులు తలెత్తి కనెక్షన్ తెగిపోయినప్పుడు శివన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసి యావత్ భారత దేశం కంటతడి పెట్టుకుంది. కన్నీరుకారుస్తున్న శివన్ ను గట్టిగా వాటేసుకొని ప్రధాని మోదీ ఓదార్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.