Viral Video: ఆకలిమీదున్న చిరుత జింకను వేటాడింది.. పరుగెత్తుకొచ్చిన సింహం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు నెటిజన్లను..

Viral Video: ఆకలిమీదున్న చిరుత జింకను వేటాడింది.. పరుగెత్తుకొచ్చిన సింహం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Animals

Updated on: Jun 28, 2021 | 10:19 PM

Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు నెటిజన్లను, ప్రజలను చాలా ఆకట్టుకుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడవికి రాజు సింహం అనే విషయం తెలిసిందే. ఈ వీడియోను చూస్తే.. అడవికి రాజు సింహం అని ఎందుకంటారో మీకే క్లారిటీ వస్తుంది.

సింహం గర్జనకు ఏ జంతువు అయినా హడలిపోవాల్సిందే. అడవిలో ఉండే ప్రతీ జంతువు సింహానికి మోకరిల్లుతాయి. సింహం అంత దూరంలో ఉండగానే ఇతర జంతువులు ఇటు నుంచి ఇటే సర్దుకుంటాయి. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా సింహం పవర్ ఏంటో నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. ఆ వీడియోలో మాంచి ఆకలి మీదున్న చిరుత పులి.. మరో జంతువును వేటాడి చంపేస్తుంది. దానిని తినడానికి అనువైన ప్రదేశానికి తీసుకువస్తుంది చిరుత. అయితే, ఊహించని రీతిలో ఎదురుగా సింహం పరుగెత్తుకుంటూ వచ్చింది. అది గమనించిన చిరుత పులి.. తాను వెటాడిన జంతువును అక్కడే సింహానికి వదిలేసి పారిపోయింది. చిరుత వెళ్లిపోవడంతో.. ఆ మృత జీవిని సింహం లాక్కెల్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘‘వైల్డ్ లైఫ్_0.2’’ యూజర్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఎంతైనా మృగరాజు మృగరాజే అని కామెంట్స్ చేస్తున్నారు. అడవిలో ఇతర జంతువులు సజీవంగా ఉండాలంటే వాటిని కళ్లు, చెవులే కాదు.. శరీరంలోని అణువణువూ అప్రమత్తంగా ఉండాల్సిందే అని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15వేల మంది వరకు వీక్షించారు. వందల సంఖ్యలో కామెంట్స్ చేశారు.

Also read:

Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్… ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి… ( వీడియో )

LIC Nivesh Plus Policy : ఒక్కసారి ప్రీమియం చెల్లించి లైఫ్‌లాంగ్ ధీమాగా ఉండండి..! తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

Viral Video: చీరకట్టులో స్కేటింగ్.. 46 ఏళ్ల ఆంటీ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..