Man in Sea: ధైర్యం, ఆలోచనా శక్తి ఓ యువకుడిని ప్రాణాలతో బయటపడేలా చేసింది. సముద్రంలో రెండు వారాల పాటు చెక్క బోర్డ్‌ను పట్టుకుని ఉన్న ఆ యువకుడు చివరికి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. వివరాల్లోకెళితే.. ఇండోనేషియాకు చెందిన 18 ఏళ్ల యువకుడు మహ్మద్ కార్టోయే మరో ఆరుగురు మతస్యకారులు మార్చి9వ తేదీన బాలికి బయలుదేరారు. ఆ సమయంలో భారీ బోట్ వీరి పడను ఢీకొనడంతో వీరు ప్రయాణిస్తున్న పడవ పూర్తిగా ధ్వంసమైపోయింది. అలా ధ్వంసమైన పడవ శకలాలను ఆసరగా చేసుకుని కొందరు మత్స్యకారులు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అందులో కార్డోయే కూడా ఉన్నాయి. అయితే, కళ్ల ముందే ఒక్కొక్కరుగా జలసమాధి అవుతున్నారు. అయినా గుండెను నిబ్బరం చేసుకున్నాడు కార్టోయే. తిండి తిప్పలు లేకుండానే రెండు వారాల ప్రాణాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపాడు. ఎవరైనా రాకపోతారా అనుకుంటూ ఎదరుచూస్తూ ఉన్నాడు.
సులావేసి ద్వీపానికి కొద్ది దూరంలో నీటిలో పడవ శకలాలను బాలి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సభ్యులు గమనించారు. సముద్రంలో ఆ శకలాలు ఉన్న స్థలానికి వెళ్లి చూడగా.. ఆ శకలాలను పట్టుకుని కార్టోయే ప్రాణాలు కాపాడుకోవడం కోసం పోరాడుతున్న దృశ్యాన్ని వారు గమనించారు. వెంటనే ఆ రెస్క్యూ సిబ్బంది కార్టోయేని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. తనను కాపాడినందుకు కార్టోయే.. బాలి రెస్క్యూ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, తనతో వచ్చిన వారిలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు ఏమైపోయారు తెలియదని కార్టోయే పేర్కొన్నాడు.
ఇదిలాఉంటే.. ఇలాంటి ఘటనే గత నెలలోనూ చోటు చేసుకుంది. ముగ్గురు క్యూబన్ జాతీయులు బహామాస్‌లో జనావాసాలు లేని ద్వీపంలో 30 రోజులకు పైగా చిక్కుకుపోయారు. వారి పడవ బోల్తా పడటంతో వారు వారు సమీపంలోని ద్వీపానికి ఈదుకుంటూ చేరుకుని తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే, అక్కడ జనాలు లేకపోవడంతో కొబ్బరికాయలు, ఎలుకలు, ఇతర మాంసం తిని 33 రోజులు బ్రతికారు. అయితే, ఫిబ్రవరి 10వ తేదీన యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని కనిపెట్టి రక్షించారు. దాంతో వారి కథ కూడా సుఖాంతం అయ్యింది.
Also read:
Viral Video: స్వీట్ షాపులోకి దూరిన కుక్క.. కడుపునిండా తన్నది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..