మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన బంగారు ఎద్దు, షోకేస్ అద్దాలు పగులగొట్టుకొని ఎందుకు కిందకి దూకింది.?

Golden Bull Viral Video అవును, మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన అతిపెద్ద బంగారు ఎద్దు తన సామాజిక బాధ్యతను నెరవేర్చింది. అందుకోసంగా..

మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన బంగారు ఎద్దు, షోకేస్ అద్దాలు పగులగొట్టుకొని ఎందుకు కిందకి దూకింది.?
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 17, 2021 | 1:33 PM

Golden Bull Viral Video అవును, మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన అతిపెద్ద బంగారు ఎద్దు తన సామాజిక బాధ్యతను నెరవేర్చింది. అందుకోసంగా భారీ షాపింగ్ మాల్ పైఅంతస్తులో ఉన్న షోకేస్ అద్దాలు పగులగొట్టుకుని మరీ కిందకి దూకేసింది. అయితే, ఎందుకు ఆ బంగారు వర్ణంలోకి మారిన ఎద్దు అంతపని చేసింది అనేదా మీ సందేహం? ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారిపైనే ఆ ధవళవర్ణ శోభిత ఎద్దు యుద్ధం. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ ఈ వింతకు వేదికైంది. సదరు మాల్ వెలుపల పెట్టిన ఈ సూపర్ కూల్ 3 డి యానిమేటెడ్ గోల్డెన్ బుల్ ఇప్పుడు వైరల్ వీడియోగా మారింది.

పై నుంచి వచ్చిన రెండు రోబోటిక్ చేతుల ద్వారా బంగారంతో కప్పబడిన వెంటనే, ‘టుగెదర్ ఫైట్ ఎగైనెస్ట్ కొవిడ్ -19 ‘ తెరను ఛిద్రం చేసుకుని వస్తున్న ఎద్దు త్రీడీ మోషన్ పిక్చర్ చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. 17 సెకన్లపాటు ఉన్నఈ త్రీ డి యానిమేషన్ వీడియో మలేషియా నగరం లోని ప్రసిద్ధ పెవిలియన్ మాల్ ఎంట్రన్స్ లో పెట్టారు. చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ త్రీడీ యానిమేషన్ ప్రదర్శిస్తున్నారు. 15 అడుగుల ఎత్తు మరియు 16 అడుగుల వెడల్పు గల ఈ “అతిపెద్ద గోల్డెన్ బుల్” మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఈ గోల్డెన్ బుల్ మార్చి వరకు మాల్ సెంటర్ కోర్టులో తిరిగే వేదికపై ప్రదర్శించబడుతుంది.

Read also : AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 9.30 గంటలకు 30 శాతం పోలింగ్.