Viral News: ఆ దేశ అధ్యక్ష భవనం రక్షణ బాధ్యతను గద్దలు, గుడ్ల గూబలు చూసుకుంటాయి

|

Jul 17, 2021 | 11:21 AM

సాధారణంగా ఏ దేశంలోనైనా రాష్ట్రపతి భవన్ లేదా ప్రధానమంత్రి నివాసం భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. హైలీ ట్రైన్డ్ కమాండోలు, ప్రత్యేక రక్షణ బలగాలు....

Viral News: ఆ దేశ అధ్యక్ష భవనం రక్షణ బాధ్యతను గద్దలు, గుడ్ల గూబలు చూసుకుంటాయి
President Of Russian House
Follow us on

సాధారణంగా ఏ దేశంలోనైనా అధ్యక్ష భవనం లేదా ప్రధాన మంత్రి నివాసం భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. హైలీ ట్రైన్డ్ కమాండోలు, ప్రత్యేక రక్షణ బలగాలు నిత్యం అక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. ప్రతి క్షణం సీసీ టీవీల పర్యవేక్షణ ఉంటుంది. కిలోమీటరు దూరం నుంచే పెన్సింగులు, బారికేడ్లు దర్శనమిస్తాయి. ఆ భవనం సమీప ప్రాంతాల్లో గగనతలంపై కూడా ఆంక్షలు ఉంటాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే దేశంలో అధ్యక్ష భవనంకు ఒక ప్రత్యేకత ఉంది. భవనం చుట్టూ పక్షులు రక్షణగా ఉంటాయి. అవును ఈ విషయం పూర్తిగా నిజం.మేము రష్యా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ క్రెమ్లిన్.. దాని చుట్టూ ఉన్న ప్రధాన ప్రభుత్వ భవనాల గురించి మాట్లాడుతున్నాం. వాటిని రక్షించే బాధ్యతను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన గద్దలు, గుడ్లగూబలు చూసుకుంటాయి. 1984 నుంచి అక్కడి అధ్యక్ష భవనంకు ఈ తరహా రక్షణ కల్పిస్తున్నారు.

కాగా ఈ పక్షులతో అక్కడ గస్తీ కాయించడం వెనుక ప్రధాన ధ్యేయం..  అధ్యక్ష భవనంతో పాటు దాని చుట్టూ ఉంటే ఇతర ప్రధాన భవనాలను శుభ్రంగా ఉంచడమే. కాకులు లేదా ఇతర పక్షులు ఆ భవనాలకు వద్దకు వచ్చి అపరిశుభ్రం చేయకుండా వారు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఏవైనా పక్షులు ఆ భవనాలవైపు వస్తే చాలు.. ట్రైనింగ్ ఇచ్చిన ఈ గద్దలు, గుడ్లగూబలు వాటిపై అటాక్ చేసి పారద్రోలడమో, చంపివేయడమో చేస్తాయి. దీంతో అటువైపు రావడానికి, గూడ్లు కట్టుకోవడానికి మిగతా పక్షులు సాహసం చేయవు. ప్రస్తుతం 10 గద్దలు, 10 గుడ్ల గూబలు ఆ ప్రాంత రక్షణ బాధ్యతలను చూస్తున్నాయి.

Also Read: ఫేక్ పోటుగాడు : డీఎస్పీ డ్రెస్‌లో బిల్డప్ ఇచ్చి.. ఎన్ని యవ్వారాలు చక్కబెట్టాడంటే..!

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా..?