Viral Photo: పిచ్చికి పరాకాష్టా..?.. లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్

గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్‌ను మిస్ యూజ్ చేసేవారు కూడా అంతేస్థాయిలో పెరిగిపోయారు.

Viral Photo: పిచ్చికి పరాకాష్టా..?.. లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్

Updated on: Feb 04, 2021 | 1:23 PM

గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్‌ను మిస్ యూజ్ చేసేవారు కూడా అంతేస్థాయిలో పెరిగిపోయారు. ఆధునికత అన్ని అసాధ్యాలను సాధ్యం చేసింది.. నిజమే కానీ చాలామంది దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అనిపిస్తుంది. రోజూ ఇంటర్నెట్ దుర్వినియోగంపై చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వార్త తాజాగా తెరపైకి వచ్చింది. పర్వతం అంచున నిలబడి ఉన్న ఓ జంట వైరల్ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫోటో చూసిన తర్వాత చాలా మంది ఒళ్లు జలదరిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. పిచ్చికి పరాకాష్ఠ అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి, ఈ ఫోటో చూసిన తర్వాత ప్రజలు అయోమయంలో ఉన్నారు. అసలు ఈ పిక్ నిజమా లేదా అబద్ధమా? అని సెర్చ్ చేస్తున్నారు.  ఎందుకంటే, ఈ మధ్య కొన్ని ఫోటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటోలు కూడా ఇదే స్థాయిలో వైరలవుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఫోటోను టర్కీలోని గులేక్ ప్యాలెస్‌లో క్లిక్ చేశారు. ఈ ఫోటోలో ఒక యువకుడు కొండ అంచుపై నుంచి వాలిపోయినట్లు ఉండగా, ఒక అమ్మాయి అక్కడే నిలబడి అతనికి చేయి అందిస్తున్నట్లు ఉంది. ఈ పిక్ మొదటిసారి చూసిన వ్యక్తి భయపడటం ఖాయం. రెడ్‌స్‌రెడిట్స్ అనే యూజర్ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకవేళ ఈ చిత్రం నిజమైనదే అయితే ఫోటోగ్రాఫర్ స్కిల్స్‌ను అభినందించాల్సిందే అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

 

Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?