ఈ గ్రామంలో పుట్టిన ప్రతి కుక్క కోటీశ్వరుడు/ కోటీశ్వరాలు అవుతుంది! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

|

Apr 06, 2021 | 9:22 PM

మనుషులు కోటీశ్వరులుగా ఎదిగిన కథలు మీరూ చాలా విని ఉంటారు.. చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా కుక్క లక్షాధికారి అవ్వడం మీరు ఎప్పుడైనా విన్నారా?..

ఈ గ్రామంలో పుట్టిన ప్రతి కుక్క కోటీశ్వరుడు/ కోటీశ్వరాలు అవుతుంది! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు
Rich Dogs
Follow us on

మనుషులు కోటీశ్వరులుగా ఎదిగిన కథలు మీరూ చాలా విని ఉంటారు.. చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా కుక్క కోటీశ్వరుడు/కోటీశ్వరాలు అవ్వడం మీరు ఎప్పుడైనా విన్నారా?..ఇదేం సినిమా స్టోరీ కాదండి. దీని గురించి టోటల్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.

మేము గుజరాత్‌లోని మెహ్సానా సమీపంలోని పంచోట్ గ్రామంలోని కుక్కల గురించి మాట్లాడుతున్నాము.  అక్కడ కుక్క జన్మించిన వెంటనే కోటీశ్వరుడు/కోటీశ్వరాలు అవుతుంది. వీధిలో తిరిగే కుక్కులు కోటీశ్వర్లుగా ఎలా మారగలరని ఇప్పుడు మీ మనస్సులో ప్రశ్న మెదులుతుందని మాకు తెలుసు. ఈ ఊరికి సమీపంలో మెహ్సానా బైపాస్ నిర్మించబడినందున, దగ్గర్లోని భూమి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో గ్రామంలోని కుక్కలు కూడా ప్రయోజనం పొందాయి.

కుక్కలు కోటీశ్వరుడు/కోటీశ్వరాలు ఎలా అయ్యాయి..?

‘మధ్ ని పాటి కుటారియా ట్రస్ట్’ కు గ్రామంలో సుమారు 21 బిగాల(నాలుగు బిగాలు కలిస్తే ఒక ఎకరం) భూమి ఉంది. ఈ భూమి ద్వారా వచ్చే మొత్తం కుక్కలదే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గ్రామంలో కుక్కలను పోషించడానికి భూమిని దానం చేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఈ భూమి పక్కన బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు.  ఈ కారణంగా లక్ష రూపాయల విలువైన భూమి ఈ రోజు కోట్లకు చేరుకుంది. అక్కడ ట్రస్ట్ కింద ఉన్న భూమి విలువ సుమారు రూ. 75 కోట్లు ఉంటుందని అంచనా.

ఈ భూముల ధరలు పెరిగినప్పటికీ,  యజమానులు తిరిగి వచ్చి తమ భూమిని తిరిగి ఇవ్వమని కోరలేదు. జంతువుల కోసం లేదా ఏదైనా సామాజిక పనుల కోసం విరాళంగా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవడం దుర్మార్గమని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

కుక్కలు భూమి ఆదాయానికి అర్హులు..

ఈ భూములను ఇప్పుడు కొందరు సాగు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పంట విత్తనాల సీజన్‌కు ముందు ట్రస్ట్… భూమిని వేలం పద్దతిలో కౌలుకు ఇస్తుంది. అత్యధిక బిడ్డర్ ఒక సంవత్సరం భూమిని సాగు చేసుకునే హక్కు పొందుతారు. దీనితో పాటు, ఈ భూముల పక్కన ప్రాంతాలలో పెద్ద మాల్స్ నిర్మించడం, బైపాస్ రావడంతో.. ల్యాండ్ ధరలు ఆకాశాన్నంటాయి. కౌలుకు ఇవ్వగా వచ్చిన మొత్తాన్ని కేవలం కుక్కుల కోసమే ఖర్చు చేస్తుంది ట్రస్ట్.

అదే గ్రామ నివాసి నరేష్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘మేము సదరు భూమిని ఎప్పటికీ అమ్మవద్దని ప్రతిజ్ఞ చేశాము. ఇక్కడ జన్మించిన ప్రతి కుక్క లక్షల రూపాయల సంపదతో పుడుతుందని అర్థం’ అని చెప్పారు. సెంట్ భూమి కోసం తోబుట్టులు మధ్యే కొట్లాటలు, చంపుకోవడాలు వంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది పంచోట్  గ్రామస్తులు అంత విలువైన భూమిని ఇప్పటికీ కుక్కల కోసం ఉంచడం నిజంగా గొప్ప విషయమే.

Also Read: రూ. 5 లక్షలకు అట్టా నిప్పంటించాడు.. అన్ని కొత్త నోట్ల కట్టలే.. రీజన్ ఇది

మరో ట్విస్ట్.. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఎస్ఈసీ