Viral News: పక్షికి తల్లిగా మారిన కుక్క.. అచ్చం కుక్కలాగే అరుస్తున్న పక్షి.. ఎక్కడంటే..

జంతువులకు కూడా ప్రేమా.. జాలి, దయ ఉంటాయని పలు సందర్భాల్లో చూస్తునే ఉంటాం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల్లో ఈ ఎమోషన్స్ ఎప్పుడూ కనిపిస్తునే ఉంటాయి.

Viral News: పక్షికి తల్లిగా మారిన కుక్క.. అచ్చం కుక్కలాగే అరుస్తున్న పక్షి.. ఎక్కడంటే..
Viral Video
Follow us

|

Updated on: Jun 17, 2021 | 8:47 PM

జంతువులకు కూడా ప్రేమా.. జాలి, దయ ఉంటాయని పలు సందర్భాల్లో చూస్తునే ఉంటాం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల్లో ఈ ఎమోషన్స్ ఎప్పుడూ కనిపిస్తునే ఉంటాయి. అయితే ఒకే ఇంట్లో రెండు వేరు వేరు జాతులకు సంబంధించిన జీవులు ఉంటే ఎలా ఉంటుంది.. సాధారణంగా.. కొన్ని వీడియోలు చూసే ఉంటాం.. ఒక పక్షి.. ఇంట్లో ఉండే కుక్క స్నేహితులుగా మారాయి.. కలిసి ఆడుకుంటున్నాయనే వీడియోలు వినే ఉంటాం. అయితే ఇక్కడ ఓ కుక్క మాత్రం పక్షికి తల్లిగా మారింది. పక్షిని తన బిడ్డలా చూసుకుంటోంది. తల్లికాకపోయినా ఆ పక్షికి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇక పక్షి పరిస్థితి కూడా అంతే.. అచ్చం కుక్కలాగే ప్రవర్తిస్తోంది. కుక్కలాగే మొరగటం మొదలు పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ దంపతులు… గతేడాది అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉన్న ఓ పక్షిని చేరదీశారు. దానికి మోలీ అని పేరుపెట్టారు. అనారోగ్యంతో ఉన్న మోలీ..వారి పెంపుడు కుక్క పెగ్గీ సహకారంతో త్వరగానే కోలుకుంది. పెగ్గీ చూపిన ప్రేమకు ఆ పక్షి ఎప్పుడూ ఆ కుక్క వెంటే ఉంటూ వచ్చింది. అలా అవి ఒకదానితో ఒకటి కలిసి ఉండటంతో ఆ పక్షి పూర్తిగా మారిపోయింది. కుక్కలా ప్రవర్తించటం.. మొరగటం చేస్తోంది. మొదట్లో అది పెగ్గీ అరుపులని భావించారు. కానీ, మోలీ ఆ అరుపులు చేస్తోందని తెలుసుకుని వారు కూడా అవాక్కయ్యారు. పక్షి అచ్చం కుక్కలా అరుస్తుండటంతో ఆశ్చర్యంతో పడిపడి నవ్వుకున్నారట. ఇంటి ఆవరణలో వేరే కుక్కల అరుపులు వినిపిస్తే చాలు.. మోలీ కూడా అరవటం చేస్తోంది. కేవలం మోలీలోనే కాదు.. పెగ్గీలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. మోలీ ఇక్కడి రాకమునుపు పెగ్గీకి పక్షులంటే భయం ఉండేదట… కానీ, మోలీ పరిచయం తర్వాత పెగ్గీలో ఆ భయం పోయిందని ఆ దంపతులు చెప్పారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే…పెగ్గీ.. మోలీని తన బిడ్డలా భావిస్తోంది. అందుకే.. తల్లి కాకపోయినా పిల్లలకు పాలు ఇచ్చినట్లు మోలీకి కూడా పాలు ఇవ్వటానికి చూస్తోంది. ఈ కారణంతో పెగ్గీ శరీరంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని అక్కడి వెటర్నరీ డాక్టర్‌ చెప్పారు. మోలీ కూడా కుక్క పిల్లలు పాలు తాగుతున్నట్లుగానే చేస్తోంది. మొత్తనికి ఈ తల్లీ బిడ్డల ప్రేమ నెటిజన్లను కట్టిపడేస్తోంది.

Also Read: Baby Girl in Ganga River: గంగా నదిలో తేలియాడుతున్న డబ్బా.. ఒడ్డుకు చేర్చి తెరిచి చూసిన బోటు యాజమాని షాక్..!

Sajjala : ‘పవన్‌ కళ్యాణ్ కైతే నచ్చచెప్పొచ్చు.. ఇన్నేళ్ల పాలనానుభవం ఉన్న బాబు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ : సజ్జల