Crocodile trapped : బాబోయ్‌… మన బొంబాయిలో ఇంత పెద్దదా.. ! మహబూబాబాద్ జిల్లా ఊర చెరువులో వలలో చిక్కిన భారీ మకరం

Crocodile trapped in a fishing net : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం‌లోని బొంబాయి ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు కొందరు మత్స్యకారులు. రోజులాగే చెరువులో చేపలు పట్టడానికి..

Crocodile trapped : బాబోయ్‌... మన బొంబాయిలో ఇంత పెద్దదా.. ! మహబూబాబాద్ జిల్లా ఊర చెరువులో వలలో చిక్కిన భారీ మకరం
Crocodile

Updated on: Mar 31, 2021 | 9:11 PM

Crocodile trapped in a fishing net : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం‌లోని బొంబాయి ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు కొందరు మత్స్యకారులు. రోజులాగే చెరువులో చేపలు పట్టడానికి వల విసిరారు. కొద్ది సేపటికి వల లాగుతూ ఉంటే అది చాలా బరువుగా ఉంది. దీంతో అరే.. పెద్ద చాపే పడింది అనుకున్న మత్స్యకారుల ఆనందం ఇట్టే ఆవిరైపోయింది. ఒక్క చాప కాదు కానీ… 80 కేజీల బరువు ,7 ఫీట్ల పొడవు ఉన్న మొసలి చిక్కడంతో మత్స్యకారులు భయందోళన గురయ్యారు. సంవత్సర కాలంగా ఈ మొసలి మా మత్స్య కారులకు కంటిమీద కునుకు లేకుండా, భయ బ్రాంతులకు గురి చేస్తోందని వారు చెప్పుకొచ్చారు. ఊహించని రీతిలో వలలో చిక్కిన మొసలిని చూసి.. ఖంగుతిన్న మత్స్యకారులు మొత్తానికి ఊపిరిపీల్చుకుని ఎట్టకేలకు దానిని బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అటవీశాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని, పాఖాల సరస్సులో సురక్షితంగా వదిలేశారు.

Pakala Pond Crocodile

Read also : Pakistan – India : దారిలోకొచ్చిన దాయాది దేశం… భారత్ పై విధించిన దాదాపు రెండేళ్ల నిషేధానికి తిలోదకాలిచ్చిన పాక్