భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న పెద్దన్న

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న టారిఫ్‌లు ఆమోదయోగ్యం కాదంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఇక సహించేది లేదని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే.. తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు పెద్దన్న. అమెరికా వస్తువులపై పన్నులు విధిస్తున్నందుకు గతంలోనూ భారత్‌ను సుంకాల రారాజు అని విమర్శించారు ట్రంప్. అలాగే హార్లీ డేవిడ్ సన్ బైకులపై భారత్‌ భారీ టారిఫ్‌లు […]

భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న పెద్దన్న
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 5:40 AM

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న టారిఫ్‌లు ఆమోదయోగ్యం కాదంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఇక సహించేది లేదని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే.. తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు పెద్దన్న. అమెరికా వస్తువులపై పన్నులు విధిస్తున్నందుకు గతంలోనూ భారత్‌ను సుంకాల రారాజు అని విమర్శించారు ట్రంప్. అలాగే హార్లీ డేవిడ్ సన్ బైకులపై భారత్‌ భారీ టారిఫ్‌లు విధిస్తోందని పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గతేడాది మార్చి నుంచి భారత్ ఉత్పుత్తులైన స్టీల్, అల్యూమినియంలపై అదనపు సుంకాలు విధించింది అమెరికా. అయినా కొన్నాళ్లు మౌనంగానే ఉన్న భారత్.. జీఎస్పీ జాబితా నుంచి తొలగించడంతో అమెరికాకు చెందిన 28 వస్తువులపై జూన్ 16 నుంచి అదనపు సుంకాలు విధఇంచింది

భారత్ అమలుచేస్తున్న సుంకాల పెంపుతో అమెరికా ఆదాయానికి భారీగా గండిపడటంతో పాటు.. ఆ దేశ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో వరుసగా భారత్‌పై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్. టారీఫ్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గత నెల 28న జీ-20 దేశాల సదస్సులో భేటీ అయిన ప్రధాని మోదీ, ట్రంప్ ఓ అంగీకారానికి వచ్చారు. ఇరు దేశాల ఆర్థిక మంత్రులు సమావేశహై ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై చర్చించాలని నిర్ణయించారు. మరోవైపు ఇటీవలే ఇండియాలో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో.. ప్రధాని మోదీతో పాటు భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో పలు కీలక చర్చలు జరిపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రంప్ భారత్ పట్ల తన కఠిన వైఖరిని మరోసారి ప్రదర్శించారు.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇవాళ వాషింగ్టన్ డీసీలో జరగనున్న సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ అల్లుడు, ఆయన సీనియర్ సలహాదారు జరెడ్ కుష్నార్‌తో పాటు.. ఆ దేశ వాణిజ్య మంత్రి విల్‌బర్‌రాన్, ఇంధన మంత్రి రిక్‌పెర్రీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.

భారత్ – అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని చెబుతున్న ఈ సమయంలో ట్రంప్ చేసిన ట్వీట్.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో