బెంగళూరు, జులై 27: ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరైన ఓ యువతికి విచిత్ర అనుభవం ఎదురైంది. తన చర్మ రంగు కారణంగా ఉద్యోగానికి అనర్హురాలిగా కంపెనీ రిజెక్ట్ చేసిందని వాపోయింది. సాధారణంగా సరైన క్వాలిఫికేషన్స్ లేవనో.. స్కిల్స్ లేవనో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తారు. కానీ ఇదేంటీ..? ఇలా కూడా చేస్తారా అంటూ సోషల్ మీడియాలో తన గోడువెల్లగక్కింది సదరు యువతి. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..
బెంగళూరులోని ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి ప్రతీక్ష జిక్కర్ అనే యువతి ఇంటర్వ్యూకి హాజరైంది. మూడు రౌండ్ల ఇంటర్వ్యూలోనూ ఆమె నెగ్గింది. ఐతే జాబ్‌కి సెలెక్ట్‌కాలేదు. అందుకు గల కారణాన్ని సదరు కంపెనీ ప్రతీక్షకు మెయిల్ పంపించింది. అందులో ఏముందంటే.. ఉద్యోగం పొందడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు, అర్హతలు మీకు ఉన్నాయి. కానీ మీ శరీర రంగు (స్కిన్ టోన్) మా టీంతో మ్యాచ్ కాలేదు. మీ చర్మం రంగు తెల్లగా ఉండటం వల్ల టీంలో విభేదాలు తలెత్తుతాయని యాజమన్యం భావించింది. అందుకే మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేం అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు.
A girl got rejected because she had a fair complexion
What a time to be alive pic.twitter.com/bGNZISfp4c
— Aryan Trivedi (@AryanTrivedi_7) July 25, 2023
దీంతో ఖంగు తిన్న సందరు యువతి కంపెనీ నుంచి తనకు వచ్చిన మెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేరు చేసింది. మనిషి రంగును బట్టి కాకుండా ట్యాలెంట్‌ను బట్టి ఉద్యోగం ఇవ్వాలని తన పోస్టులో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.