బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఓ యువతి రాసిన లేఖ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. తన ప్రేమను తాను ప్రేమించిన వ్యక్తికి చెప్పలేకపోతున్నాంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎఫైర్ పెట్టుకోవాల్సిన టైమ్ లో కరంట్ అఫైర్స్ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగం వస్తే తన ప్రేమను తెలియజేద్దామనుకుంటున్నానని, కానీ జాబ్ రావడం లేదని, దాంతో ప్రేమను తెలపలేకపోతున్నట్లు పేర్కొంది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంగా మారిందంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువతి.. ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఉపముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ప్రభాత్‌ను తాను ప్రేమిస్తు్న్నట్లు.. అతనొక యువ రచయిత అని తెలిపింది. కాగా.. ప్రభాత్ రాసిన బనారస్ వాలా ఇష్క్, యూ కెన్ కాల్ మీ కాఫీర్ అనే పుస్తకాలు బాగా ఆదరణ పొందాయి.
అయితే.. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్రాలేదని, ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. తన తండ్రి తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాడని, ఇవన్నీ ఆలోచిస్తే తాను చాలా నిరాశకు గురవుతున్నానని ఆవేదన చెందింది. ఈ లేఖను ఎంతో ఆశతో రాస్తున్నానని, తనకు ఉద్యోగం రాకపోతే.. ప్రేమించిన రచయితకు దూరమవుతానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ లెటర్ పై స్పందించన ప్రభాత్.. ఆ యువతి ఎవరో తనకు తెలియదని, ఎవరితోనూ ప్రేమలో లేనన చెప్పారు. ఈ లేఖలో నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉంది. తనను కేవలం ప్రచారానికే వాడుకున్నారని మండిపడ్డారు. ఆమెకు కావాల్సింది ప్రేమ కాదు, ఉద్యోగం మాత్రమేనని ప్రభాత్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం