Video: ఇది కదా మానవత్వం అంటే.. ఆకలితో అలమటించిన ఉడత.. యువకుడు ఏం చేశాడంటే..

|

Nov 13, 2022 | 10:28 AM

దాహంతో ఉన్నవారికి నీరు తాగించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మానవత్వానికి ప్రతీకలు. అవసరం అయినప్పుడు ఇలాంటి పనులు చేయడం మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే...

Video: ఇది కదా మానవత్వం అంటే.. ఆకలితో అలమటించిన ఉడత.. యువకుడు ఏం చేశాడంటే..
Sqirral Video
Follow us on

దాహంతో ఉన్నవారికి నీరు తాగించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మానవత్వానికి ప్రతీకలు. అవసరం అయినప్పుడు ఇలాంటి పనులు చేయడం మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. దీనిని కొంతమంది ఇప్పటికీ ఫాలో అవుతున్నా.. మరి కొంత మంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు. మనిషిగా ఆలోచిస్తే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా అవసరం. అయితే మాటలు రాని మూగజీవాల పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా. వాటి ఆకలి ఎవరు తీరుస్తారనే విషయాన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా. వీటి ఆలనా పాలనా చూసేందుకు జంతు ప్రేమికులు స్వచ్చంధ సంస్థలు నడిపిస్తున్నారు. కొందరు వాటి ఇబ్బందులను తెలుసుకుని అవసరాలు తీరుస్తున్నారు. ఇలాంటి వీడియోలను మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూసి ఉంటారు. అందులో ప్రజలు జంతువులకు అవసరమైన వారికి ఆహారం, నీరు అందిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మనుషులకు ఉన్నన్ని తెలివితేటలు, మాట్లాడే సామర్థ్యం జంతువులు, పక్షులకు లేవు. మనకు ఆకలిగా అనిపించినా, దాహం వేసినా అడిగి తీర్చుకుంటాం. కానీ మూగ జీవాల విషయాల్లో అలా కాదు. మాటలు రాని కారణంగా తాము పడుతున్న ఇబ్బంది గురించి చెప్పలేవు. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఉడతకు ఆహారం అందించడాన్ని చూడవచ్చు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు పార్కులోని బెంచీపై కూర్చుని కుర్ కురే తింటుంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఓ ఉడత వస్తుంది. అది అతనినే చూస్తుండటంతో ఉడతకు ఆకలిగా ఉందని యువకుడు గ్రహించాడు. ప్యాకెట్ నుంచి కుర్ కురే తీసి ఉడతకు చూపించాడు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఉడతకు ఆహారాన్ని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి కుర్ కురే తీసుకుని తినేసింది. ఆకలి తీర్చుకుని చక్కగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వీడియో అప్ లోడ్ అయిన వెంటనే అధికంగా వ్యూస్ వస్తున్నాయి. లైక్స్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇతరుల బాధ మాత్రమే కాదు.. మూగజీవాల ఇబ్బందులనూ అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే ఇతరులకు సహాయం చేయగలడనే క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.