Aadhar Card Updates: ఇకపై మీ ఇంటి నుంచే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.. కేంద్రం మరో గుడ్ న్యూస్..

ఇప్పటివకు ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి అలాంటి అవసరం ఉండదు. మీ మొబైల్ నుంచే నెంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Aadhar Card Updates: ఇకపై మీ ఇంటి నుంచే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.. కేంద్రం మరో గుడ్ న్యూస్..
Aadhar Card Mobile

Updated on: Nov 28, 2025 | 3:44 PM

Aadhar New App: దేశంలో నివసించే ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. అప్పుడే పుట్టిన చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆధార్ అవసరమే. ఆధార్ లేకపోతే ఎలాంటి ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇతర ఆర్ధిక కార్యకలాపాలు పొందలేము. ఏ క్షణాన ఏ అవసరానికి ఆధార్ ఉపయోగపడుతుందనేది చెప్పలేం. అందుకే ఆధార్‌ను నిరంతరం మన పాకెట్‌లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఆధార్‌లో ఎప్పటికప్పుడు టెక్నాలజీకి తగ్గట్లు మార్పులు తీసుకొస్తున్న కేంద్రం.. సులువుగా ప్రజలు ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. ఆధార్ జారీ, అడ్రస్, ఇతర వివరాలు ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకునేలా సులభతరం చేసింది. ఇప్పుడు సులభంగా మొబైల్ నెంబర్‌ను కూడా అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పించనుంది.

ఇక ఇంటి నుంచే మొబైల్ నెంబర్ అప్‌డేట్

త్వరలో UIDAI తీసుకొచ్చిన ఆధార్ యాప్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. అదే ఇంటి దగ్గరే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌకర్యం. ఈ విషయాన్ని UIDAI తన ఎక్స్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు మొబైల్ అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకునే వెసులుబాటు లేదు. కానీ దీనికి చెక్ పెడుతూ ఓటీపీ, ఆధార్ ఫేస్ అధంటిఫికేషన్ కలిపి కొత్త టెక్నాలజీని UIDAI తీసుకొస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ ఇంటి వద్దనే మీ మొబైల్ ద్వారా మొబైల్ నెంబర్‌ను ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చన్నమాట

ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..

ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మొబైల్ అప్‌డేషన్ అనే ఫీచర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ  మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం ఓటీపీని ఎంటర్ చేసి మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఫేస్‌ను కన్ఫార్మ్ చేయలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అలాంటివారు తమ ఫీడ్ బ్యాక్‌ను తెలపాలని UIDAI స్పష్టం చేసింది.