Yogini Mata Idol: భారత్‌కు చేరిన యోగిని మాత.. లండన్ నుంచి ఢిల్లీ.. 1200 ఏళ్ల నాటి ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు..

|

Jul 11, 2022 | 2:40 PM

Yogini Mata Idol: 1200 ఏళ్ల నాటి యోగిని విగ్రహాన్ని 40 ఏళ్ల తర్వాత లండన్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం  ఈ ప్రత్యేక మేక తల విగ్రహాన్ని పురానా ఖిలా వద్ద ఉన్న ఓల్డ్ ఫోర్ట్ మ్యూజియంకు అప్పగించారు. ఈ విగ్రహాన్ని..

Yogini Mata Idol: భారత్‌కు చేరిన యోగిని మాత.. లండన్ నుంచి ఢిల్లీ.. 1200 ఏళ్ల నాటి ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు..
Yogini Statue From Chitrako
Follow us on

మరో విగ్రహం లండన్‌ నుంచి భారత్‌కు చేరింది. భారత్ నుంచి చోరీకి గురైన 1200 ఏళ్ల నాటి యోగిని విగ్రహాన్ని 40 ఏళ్ల తర్వాత లండన్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం  ఈ ప్రత్యేక మేక తల విగ్రహాన్ని పురానా ఖిలా వద్ద ఉన్న ఓల్డ్ ఫోర్ట్ మ్యూజియంకు అప్పగించారు. ఈ విగ్రహాన్ని చిత్రకూట్‌లోని లారీ గ్రామపంచాయతీలోని లోఖ్రీ గ్రామంలోని 64 యోగిని ఆలయంలో ప్రతిష్టించాలా లేదా దానిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాలా వద్దా అనే నిర్ణయం తర్వాత కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్ణయించనుంది. అయితే ఈ విగ్రహం ఎక్కడ చోరీకి గురైందో అదే ఆలయానికి మళ్లీ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

10వ శతాబ్దానికి చెందిన ఈ మేక తల విగ్రహం సుమారు 40 సంవత్సరాల క్రితం చిత్రకూట్ నుంచి దొంగిలించబడింది. దాదాపు 6 నెలల క్రితమే ఈ విగ్రహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇసుకరాయితో చేసిన ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి. మేక తల ఉన్న మొదటి విగ్రహం ఇది.

ఈ విగ్రహం 40 ఏళ్ల క్రితం చోరీకి గురైంది

ఈ ప్రత్యేకమైన విగ్రహం 40 సంవత్సరాల క్రితం 1980లో ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలోని లౌరీ గ్రామపంచాయతీలోని లోఖ్రి గ్రామంలో (ప్రస్తుతం చిత్రకూట్ జిల్లా) ఉన్న 64 యోగిని ఆలయం నుంచి దొంగిలించబడింది. దీని తరువాత, అక్టోబర్ 2021లో, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ ఇంగ్లీష్ కంట్రీ గార్డెన్‌లో ఈ విగ్రహం ఉన్నట్లుగా ప్రవాస భారతీయులు గుర్తించారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆరు నెలల పాటు శ్రమించి ఇప్పుడు ఈ విగ్రహాన్ని భారత్‌కు తీసుకురావడంలో విజయం సాధించింది కేంద్ర ప్రభుత్వం.

 


ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడి ఇంట్లో ఈ విగ్రహాన్ని గుర్తించారు. అయితే వ్యవస్థాపకుడి భార్య మారినెలో తన భర్త మరణించిన తర్వాత తన ఇంటి నుంచి వస్తువులను పురాతన వస్తువులను విక్రయిస్తుండగా ఈ విగ్రహాన్ని ఓ బ్రిటిష్ మహిళ గుర్తించారు. భారతదేశం నుంచి దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువుల రికవరీకి అంకితమైన ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్‌ను ఈ విషయాన్ని తెలిపారు. వారు నిర్దారించుకున్న తర్వాత విగ్రహాన్ని భారత్ ప్రభుత్వానికి చెప్పారు. ఇలా ఆ విగ్రహం ఇప్పుడు భారత్‌కు వచ్చింది.

జాతీయ వార్తల కోసం..