
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం ఆయన తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా తాను తన తండ్రి అంతిమ సంస్కారాలకు వెళ్లలేకపోతున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రిని కడసారి కూడా చూడలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి పార్థివ దేహాన్ని తన స్వగ్రామం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామానికి తరలించారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. కాలేయం, కిడ్రీ సమస్యలతో గత కొద్ది రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటంతో.. మార్చి 13న ఢిల్లీలోని ఏయిమ్స్‌లో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తుండగా.. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించింది. దీంతో వెంటిలేటర్‌పై వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు.
కాగా.. యోగీ తండ్రి ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేసే పదవీ విరమణ పొందారు. అనంతరం తన స్వగ్రామంలోనే నివసిస్తున్నారు.