Yoga Celebrations: ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అయితే వీటన్నిటిలోకి మైసూరులో జరిగిన ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అనేక కారణాల వల్ల ప్రత్యేకంగా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు, దివ్యాంగులు, అనాథపిల్లలు కలిసి యోగా చేశారు. దీంతో ఈవెంట్ ఏడాది యోగా దినోత్స వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఏడాది యోగా డే థీమ్..
ఈ సంవత్సరం యోగా దినోత్సవం.. యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్‌తో రూపొందింది. మైసూర్ ప్యాలెస్ వెలుపల జరిగిన యోగా వేడుకలో ప్రధాని మోడీతో పాటు.. మొదటిసారిగా.. LGBT కమ్యూనిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ తో కలిసి యోగా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రణతి ప్రకాశ్ వెల్లడించారు. “మేం పన్నెండు మంది యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాం.. సంతోషంగా ఉన్నాం” అని ప్రణతి టీవీ9 కన్నడతో అన్నారు.
ఈ ఆలోచన ఎలా మొదలైందంటే..
మైసూరులోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఒకరైన ఎస్‌ఎ రామదాస్ కు ఎన్జీవోతో అనుబంధం ఉంది. దీంతో ఆయన ఎల్‌జిబిటి కమ్యూనిటీ సభ్యులను కూడా యోగా వేడుకలకు ఆహ్వానించాలని ఆలోచించారు. వెంటనే తన ఆలోచనను అమలు చేస్తూ.. మైసూర్ జిల్లా యంత్రాగాన్నీ రంగంలోకి దింపారు. మైసూరు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఎల్‌జిబిటి కమ్యూనిటీ సభ్యులకు రెండు వారాల పాటు ప్రీ-యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. ప్రారంభంలో.. 20 మందిని ఎంపిక చేశారు. తుది లిస్ట్ లో 12 మందికి చోటు దక్కింది. వీరు ప్రధాని మోడీ తో పాటు యోగా చేశారు.
ప్రత్యేక శిక్షణ:
“మేము మా జీవితంలో ఎప్పుడూ యోగా సాధన చేయలేదు. DHO కార్యాలయంలో శిక్షణా శిబిరం నిర్వహించారు. మాకు రెండు వారాల పాటు యోగా ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. వాస్తవానికి.. శిక్షణా సిబ్బంది మాకు ప్రధాన మంత్రి ఈవెంట్‌కు పాస్‌లు పొందేందుకు సహాయం చేసారు” అని ప్రణతి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిషా అనే మరో ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. “ఇది మాకు భిన్నమైన రోజు. కోవిడ్ మహమ్మారి సమయంలో.. మేము ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము. ఆ సమయంలో, మాకు PM మోడీ ఉచిత రేషన్ పథకం ద్వారా రేషన్ అందించారు. మేము వ్యాక్సిన్ సహాయంతో కోవిడ్‌ను ఓడించామని చెప్పారు. ప్రధాని మోడీ పాల్గొనే ఈ స్థాయి కార్యక్రమంలో పాల్గొనే ఆహ్వానం అందుకున్నందుకు మేము గౌరవంగా భావిస్తున్నామని నిషా చెప్పారు.
కొనసాగిస్తామంటున్న ప్రణతి:
యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న.. ప్రణతి .. ఆమె స్నేహితులు యోగాను ఇక నుంచి తమ జీవితంలో ఒక భాగం చేసుకుంటామని.. కొనసాగిస్తామని చెప్పారు. మేము ప్రతిరోజూ యోగా చేయాలని నిర్ణయించుకున్నాము. కనుక మేము యోగాసనాల సాధనను కొనసాగిస్తాము” అని ప్రణతి సంతకం చేసింది.
మైసూరులో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ట్రాన్స్‌జెండర్లతో పాటు 200 మంది దివ్యాంగులు, 100 మంది అనాథ పిల్లలు కూడా పాల్గొన్నారు. మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీతో పాటు 15,000 మందికి పైగా యోగాసనాలను వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..