PM Modi : ఆరోగ్యానికి యోగా చాలా అవసరం.. దీన్ని ఒకే రోజుకు పరిమితం చేయొద్దు- ప్రధాని మోదీ

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీజేపీ తొలిసారి అధికారం చేపట్టాక యోగా వేడుకలకు కేంద్రం బెంగాల్‌ను ఎంచుకుంది. నగరంలోని రెడ్‌ రోడ్డులో ఈ వేడుకల్లో బెంగాల్ సీఎం సహా 35 వేల మంది పాల్గొన్నారు.

PM Modi : ఆరోగ్యానికి యోగా చాలా అవసరం.. దీన్ని ఒకే రోజుకు పరిమితం చేయొద్దు- ప్రధాని మోదీ
International Yoga Day 2026 Pm Modi

Updated on: Jun 21, 2026 | 9:03 AM

ఈ ఏడాది ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌- ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో వేడుకలు జరుగుతున్నాయి. ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన యోగా సంగమ్‌ పోర్టల్‌లోని ‘కామన్‌ యోగా ప్రోటోకాల్‌’ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, సంఘాలు ఏకకాలంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి .ఇప్పటికే ప్రధాని మోదీతో కలిసి యోగా చేసేందుకు దేశవ్యాప్తంగా 6 లక్షల సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని యోగా సంప్రదాయంతో ముడిపెడుతూ.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

యోగా మాస్టర్‌గా ప్రధాని మోదీ

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా మాస్టర్‌గా మారిపోయారు. కోల్‌కతాలోని రెడ్‌ రోడ్‌లో నిర్వహించిన యోగా డే ఉత్సవాల్లో బెంగాల్‌ సీఎం సువేందు అధికారితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆ ప్రాంతంలో కలియతిరిగారు. యోగాసనాలు వేసే వారిని ఆయన స్వయంగా పరిశీలించారు. సాధకుల ఆసనాల్లో లోటుపాట్లను చెప్పి సరిచేశారు.

విశ్వశాంతికి యోగా ఒక మార్గం

జీవితంలో సంతులనం లోపించడం వల్లే జీవనశైలి వ్యాధులు వస్తున్నాయనీ, వీటిని అరికట్టాలంటే యోగానే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. జీవితంలో ఏం చేయాలో, ఏం చేయవద్దో యోగా చెబుతుందన్నారు. విశ్వశాంతికి యోగా ఒక మార్గం అన్నారు ప్రధాని మోదీ. యోగాను కేవలం కార్యక్రమానికి పరిమితం చేయకుండా, మన జీవితంలో, కుటుంబంలో యోగాను భాగం చేయాలన్నారు.

మోదీ ఏం మాట్లాడారో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us