Viral: అయ్యో…అయ్యయ్యో! భార్య మేకప్‌కు డబ్బులివ్వని భర్త.. కట్ చేస్తే ఊహించని షాక్..

|

Dec 26, 2022 | 7:02 PM

అయ్యో...అయ్యయ్యో! మేకప్‌కు డబ్బులివ్వలేదని భార్య ఎంత పని చేసింది.. ఆమె తీసుకున్న నిర్ణయానికి భర్త మైండ్ బ్లాంక్ అయింది.

Viral: అయ్యో...అయ్యయ్యో! భార్య మేకప్‌కు డబ్బులివ్వని భర్త.. కట్ చేస్తే ఊహించని షాక్..
Make Up Viral
Follow us on

ఈ మధ్యకాలంలో దాంపత్య జీవితం ఎటు దారి తీస్తోంది ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. చిన్న చిన్న మనస్పర్ధలే.. చివరికి పెద్ద గొడవలుగా దారి తీస్తున్నాయి. తద్వారా వివాహ బంధాలు నిట్టనిలువుగా చీలిపోతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..? ఓ మహిళ తన భర్తను మేకప్‌ కోసం డబ్బులు అడిగింది. అతడి దానికి నో అని చెప్పడంతో ఆమె ఏకంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే..

అలీఘర్‌లో నివాసముంటున్న అమిత్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తుండగా.. అతడి భార్య నాలుగేళ్ల క్రితం డివోర్స్ తీసుకుంది. అనంతరం భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ అలీఘర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన మేకప్‌ కోసం భర్త డబ్బులు ఇవ్వట్లేదని.. అలాగే కావాల్సిన ఇతర అవసరాలు సైతం తీర్చలేకపోతున్నాడని పిటిషన్‌లో పేర్కొంది. ఇక మేకప్ కోసం భర్త నుంచి విడాకులు కోరుతూ ఆమె తీసుకున్న నిర్ణయానికి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న విషయానికి కూడా విడాకులు ఇవ్వడం ఏంటని షాక్ అవుతున్నారు. మరి దీనిపై అలీఘర్ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.!