చనిపోయినట్లు తేల్చిన డాక్టర్లు.. కట్ చేస్తే.. ఇంటికి తీసుకెళ్తుండగా ఊహించని పరిణామం..

|

Feb 15, 2024 | 1:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయినట్లు ప్రకటించిన వృద్ధురాలు తన సొంత రాష్ట్రం బీహార్‌లోకి ప్రవేశించిన వెంటనే తిరిగి బతికింది. ఆ మహిళ బెగుసరాయ్‌లోని నీమా చంద్‌పురా గ్రామానికి చెందిన రాంవతి దేవిగా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కుమారులు మురారీ షావో, ఘనశ్యామ్ షావోలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది. ఫిబ్రవరి 11 న, మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పింది.

చనిపోయినట్లు తేల్చిన డాక్టర్లు.. కట్ చేస్తే.. ఇంటికి తీసుకెళ్తుండగా ఊహించని పరిణామం..
Women survived
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయినట్లు ప్రకటించిన వృద్ధురాలు తన సొంత రాష్ట్రం బీహార్‌లోకి ప్రవేశించిన వెంటనే తిరిగి బతికింది. ఆ మహిళ బెగుసరాయ్‌లోని నీమా చంద్‌పురా గ్రామానికి చెందిన రాంవతి దేవిగా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కుమారులు మురారీ షావో, ఘనశ్యామ్ షావోలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది. ఫిబ్రవరి 11 న, మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని కోర్వా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. మరణించిన మృతదేహాన్ని ఆమె కుమారులు స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని సిద్దం చేశారు. తమ సొంతూళ్లో దహనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 12న ఒక ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని బెగుసరాయ్‌కు తీసుకువస్తున్నారు. ఆసుపత్రి నుంచి తమ స్వగ్రామానికి సుమారు 18 గంటల పాటు ప్రయాణం సాగింది. ఆ తర్వాత బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చేరుకున్నప్పుడు, రాంవతి అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చింది. మొదట్లో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపి ధైర్యం చేసి ఆమెను ఒకటికి రెండు సార్లు పరీక్షించారు.

ఆమెను సజీవంగా గుర్తించిన తర్వాత, వారు బెగుసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమెను రోడ్డు మార్గంలో తీసుకువస్తుండగా, వాహనం కుదుపులకు లోనై కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)గా పనిచేసి స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ICUలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. సీపీఆర్ అనేది ప్రాణాలను రక్షించే ఒక టెక్నిక్ అని తెలిపారు. ఇది ఒక వ్యక్తి శ్వాస లేదా హృదయ స్పందన ఆగిపోయిన వెంటనే అత్యవసర పరిస్థితుల్లో తిరిగి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..