చెత్తకుప్ప దగ్గర అనుమానాస్పద సూట్‌కేసు.. రంగంలోకి పోలీసులు.. తీరా తెరిచి చూడగా..

ఢిల్లీలోని సెక్టార్-18 దగ్గర ఓ అనుమానాస్పద సూట్‌కేసు స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

చెత్తకుప్ప దగ్గర అనుమానాస్పద సూట్‌కేసు.. రంగంలోకి పోలీసులు.. తీరా తెరిచి చూడగా..
Suspicious Suitcase Representative image

Updated on: Oct 19, 2022 | 3:11 PM

సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని ఇఫ్కో చౌక్ సమీపంలో నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని మహిళను వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇఫ్కో చౌక్ దగ్గర ఒక పెద్ద సూట్‌కేస్ పడి ఉంది. సూట్‌కేస్ చుట్టూ కుక్కలు తిరుగుతూ దాన్ని పీక్కుతినేందుకు ప్రయత్నిస్తుండడంతో .. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సెక్టార్-18 పోలీసులు.. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. సూట్‌కేస్‌లో మహిళకు చెందిన కొన్ని బట్టలు కూడా ఉంచారు. మహిళ వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సూట్‌కేస్‌ను ఇక్కడికి ఎవరు పడేశారన్న దానిపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..