భర్త నుంచి విడాకులు పొందిన తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. తన తండ్రి, ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన మహిళ.. మూడేళ్ల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. దీంతో సదరు మహిళకు రెండో పెళ్లి చేయాలని బంధువులు భావించారు. ఈ మేరకు మావైయా ప్రాంతానికి చెందిన అమిత్తో సంబంధం కుదుర్చుకున్నారు. కొన్నిరోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన అమిత్.. ఆ మహిళను, తన ఇద్దరు కుమార్తెలను తనతోనే ఉండాలని ఇంటికి పిలిచాడు. మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా మహిళ కుమార్తెపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు తీసి, విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బ్లాక్మెయిల్చేశాడు. అంతేకాకుండా తాను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారని బాధిత మహిళ ఆవేదన చెందింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో.. రెండు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. బిహార్ లోని నవ్దియారీ గ్రామంలోని తన సోదరి ఇంటివద్ద ఉండే యువకుడు.. పొరుగింట్లోని పసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప ఏడుపు విన్న గ్రామస్థులు.. సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
Also Read
DC vs PBKS Live Score, IPL 2022: నాలుగో వికెట్ డౌన్.. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్.. స్కోరెంతంటే?
సీటు పై కాలేశాడని గన్తో కాల్చేశాడు.. సరదాగా సినిమాకోస్తే.. ప్రాణాలపైకి వచ్చింది.. ఎక్కడంటే..