రాజకీయాల్లో ఉన్నవారు నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. లేకపోతే అనుపమ్ హజ్రాలా అవుతుంది పరిస్థితి… పశ్చిమ బెంగాల్ నుంచి నిన్నగాక మొన్న బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనుపమ్ హజ్రా.. ఎన్నికైన ఉత్సాహంతో కాబోలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు కేసు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు.. తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఓ చెత్త కామెంట్ చేశారు అనుపమ్ హజ్రా.. ఒక ముఖ్యమంత్రిపై అందులోనూ ఓ మహిళపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు..? తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ అనుపమ్‌పై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుకు దిగారు.. కరోనా కేసుల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నదన్నది బీజేపీ ఆరోపణ. ఈ సందర్భంలోనే అనుపమ్ హజ్రా మాట్లాడుతూ, ‘నాకు కూడా ఏదో ఒక టైమ్‌లో కరోనా వైరస్ సోకుతుంది.. అప్పుడు నేను నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను.. అప్పుడు కానీ ఆమెకు ప్రజలు పడుతున్న కష్టమేమిటో తెలిసిరాదు.. ప్రియమైనవారిని కోల్పోయినవారి ఆవేదన ఆమెకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించారు.. ఇంత డర్జీ కామెంట్‌పై బెంగాల్‌లోని బీజేపీ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.. అయితే బీజేపీకి కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్ మాత్రం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని అనుపమ్ హజ్రాను ఉద్దేశిస్తూ అన్నారు..