WhatsApp Down: వాట్సప్ సేవలకు బ్రేక్.. సర్వర్‌ డౌన్‌‌తో యూజర్ల తీవ్ర ఇబ్బందులు.. మీమ్స్‌తో రచ్చ రచ్చ..

|

Oct 25, 2022 | 1:27 PM

దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WhatsApp Down: వాట్సప్ సేవలకు బ్రేక్.. సర్వర్‌ డౌన్‌‌తో యూజర్ల తీవ్ర ఇబ్బందులు.. మీమ్స్‌తో  రచ్చ రచ్చ..
Whatsapp
Follow us on

దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్‌ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్‌ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. వాట్సాప్‌లో డబుల్‌ టిక్‌ , బ్లూటిక్‌ మార్కులు చూపించడం లేదు. దీంతో యూజర్లు మేటా కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నారు. వాట్సాప్‌కు మెసేజ్‌లు రావడం లేదు.. బయట నుంచి కూడా రావడం లేదు. గతంలో కూడా వాట్సాప్‌ సర్వర్‌ పలుమార్లు డౌన్‌ అయ్యింది.

భారత్‌ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ నెట్‌వర్క్‌ మధ్యాహ్నం 12.30 నుంచి కుప్పకూలింది. వినియోగదారులు గ్రూప్ చాట్‌లకు సందేశాలను పంపలేకపోతుండటం.. వ్యక్తులకు పంపిన సందేశాలకు ఒక టిక్ మాత్రమే చూపిస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా వ్యాట్సప్ నెట్‌వర్క్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు నివేదించారు.

ఇవి కూడా చదవండి

అయితే, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ అయిన మెటా నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక స్పందన రాలేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే కాదు, వాట్సాప్ వెబ్, వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లు కూడా పనిచేయడం లేదు. వాట్సాప్ సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో కూడా స్పష్టం కాకపోవడంతో గందరగోళం నెలకొంది.

వాట్సప్ సర్వర్ డౌన్ కావడంతో.. సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్‌లో వాట్సాప్ డౌన్ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు.

వాట్సాప్ వినియోగదారులందరికీ డౌన్ అయిందో లేదో తనిఖీ చేయడానికి ట్విట్టర్‌కి వచ్చినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.

“ఒక టిక్ మాత్రమే కనిపిస్తుంది.. వాట్సాప్ డౌన్ అయిందో లేదో చూడడానికి వస్తున్నాను” అంటూ ఓ యూజర్ ట్విట్ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..