Bhabanipur bypoll: రసకందాయకంలో బెంగాల్‌ పాలిటిక్స్.. భవానీపూర్ ఉప పోరులో హోరాహోరీ.. దీదీని ఢీకొనున్న ప్రియాంక

|

Sep 10, 2021 | 4:27 PM

పశ్చిమ బెంగాల్‌ యుద్ధం మళ్లీ మొదలైంది. ఉపఎన్నికల్లో భాగంగా మూడు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అని తలపడుతున్నాయి టీఎంసీ బీజేపీ. వాటిలో భవానీపూర్‌ పోల్‌ ఇప్పుడు స్టేట్‌ ఫైట్‌గా మారింది.

Bhabanipur bypoll: రసకందాయకంలో బెంగాల్‌ పాలిటిక్స్..  భవానీపూర్ ఉప పోరులో హోరాహోరీ.. దీదీని ఢీకొనున్న ప్రియాంక
Bhabanipur Bypoll Mamata Vs Priyanka
Follow us on

West Bengal by Election: పశ్చిమ బెంగాల్‌ యుద్ధం మళ్లీ మొదలైంది. ఉపఎన్నికల్లో భాగంగా మూడు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అని తలపడుతున్నాయి టీఎంసీ బీజేపీ. వాటిలో భవానీపూర్‌ పోల్‌ ఇప్పుడు స్టేట్‌ ఫైట్‌గా మారింది. ఇక్కడ బెంగాల్ సీఎం మమతబెనర్జీ పోటీలో ఉండటంతో.. దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇటు భారతీయ జనతా పార్టీ సైతం ఎరికోరి న్యాయవాది ప్రియాంక టిబ్రీవాల్‌ను బరిలోకి దించుతున్నారు. గత ఎన్నికల్లో దీదీని మట్టి కరిపించిన కమలనాథులు ఉప ఎన్నికల్లో కూడా ఓడిస్తారా? మమతపై ప్రయోగించిన ప్రియాంక బాణం గురి చూసి కొడుతుందా? ఇప్పుడు దేశ రాజకీయాలో ప్రధాన చర్చ కొనసాగుతోంది.

భవానీపూర్‌తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్ 3న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అక్కడ మమతకు మద్దతిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైట్‌ BJP, TMC మధ్యే నెలకొంది. దీంతో బీజేపీ కూడా మహిళా అభ్యర్థిని బరిలో దింపింది.

బీజేపీ తరపున మమతపై బరిలో దిగుతున్న 41 ఏళ్ల ప్రియాంక టిబ్రీవాల్ కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియోకు లీగల్‌ అడ్వైజర్‌ గా పనిచేసిన ఆమె 2014లో పార్టీలో చేరారు. ప్రస్తుతం BJP యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ప్రియాంక.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై బీజేపీ తరపున న్యాయపోరాటం చేస్తున్నారు. పార్టీలో మంచి గుర్తింపు ఉంది.. మీడియాలో పార్టీ వాయిస్‌ బలంగా వినిపించడంలో ముందున్నారు. అంతేకాదు.. ఆమెకు ఫైర్‌ బ్రాండ్‌ ముద్ర కూడా పడింది. ఇటీవల ఎన్నికల్లోనూ పోటీచేసిన ఆమె ఓడిపోయినా.. ఇప్పుడు ఏకంగా మమతపైనే పోటీకి సిద్దమయ్యారు.

నందిగ్రామ్‌ నుంచి పోటీచేసిన మమతబెనర్జీ మాజీ శిష్యుడు సువేందుపై 19వందల ఓట్లతేడాతో ఓటమి చెందారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె చట్టసభ సభ్యురాలు కాకపోవడంతో ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆమె భవానీపూర్‌ బరిలో దిగారు. ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవ‌సాయ మంత్రి సోబ‌న్‌దేవ్ చ‌టోపాధ్యాయ్ కోసం దీదీ కోసం తన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.మరీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంతం పట్టి దీదీని ఓడించిన కమలనాథులు ఇప్పుడు భవానీపూర్‌లోనూ పోటీ ఇచ్చి మట్టి కరిపిస్తారా? జాతీయ రాజకీయాల్లో కూడా తమ కంట్లో నలుసుగా మారిన మమత బెనర్జీకి అడ్డకట్టు వేయడంలో కాషాయం ఎంతవరకు సక్సస్‌ అవుతుందో చూడాలి.

Read Also…  Mamata Banerjee: భవానీపూర్ బరిలో దీదీ.. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ