తోటివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్.. ఇద్దరు జవాన్ల మృతి..!

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సరిహద్దు భద్రతా దళం (BSF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక జవాన్ తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

తోటివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్.. ఇద్దరు జవాన్ల మృతి..!
Bsf Jawans Shot Dead

Updated on: Jul 24, 2026 | 4:41 PM

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సరిహద్దు భద్రతా దళం (BSF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక జవాన్ తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

శుక్రవారం (జూలై 24) మాల్దాలోని బీఎస్ఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన జరిగింది. శివమ్ మిశ్రా అనే జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌తో సడన్‌గా తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఊహించని దాడితో క్యాంపులోని వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తుపాకీ గుళ్లకు బలవుతూ ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో మరో జవాన్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కాల్పులకు పాల్పడిన నిందితుడు శివమ్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఉన్న ఇతర భద్రతా సిబ్బంది శివమ్ మిశ్రాను వెంటనే అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత విభేదాలు, మానసిక ఒత్తిడి, విధి నిర్వహణలో తలెత్తిన వివాదాలేమైనా ఈ దారుణానికి కారణమా అనే కోణంలో ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us