టెస్టింగులను మూడు రెట్లు పెంచాం, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 7:01 PM

నగరంలో కరోనా అదుపునకు తాము టెస్టింగులను మూడు రెట్లు ఎక్కువగా పెంచామని  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 60 వేల టెస్టింగులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా కేసులకు..

టెస్టింగులను మూడు రెట్లు పెంచాం, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్
Follow us on

నగరంలో కరోనా అదుపునకు తాము టెస్టింగులను మూడు రెట్లు ఎక్కువగా పెంచామని  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 60 వేల టెస్టింగులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కేసులు రెట్టింపు కావడానికి సుమారు 50 రోజులు పడుతోందని ఆయన తెలిపారు. కరోనా మరణాల రేటు 1.94 శాతం ఉందని ఆయన చెప్పారు. అటు-శనివారం నగరంలో 3,372 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో 4,476 మంది రోగులు కోలుకున్నారు. నగరంలో  కరోనా సెకండ్ వేవ్ మొదలైందని నిపుణులు పేర్కొన్నారని ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసులు చాలావరకు తగ్గాయని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.