అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 17, 2020 | 8:03 PM

ఈ నెల 15న గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో  జరిగిన ఘర్షణల్లో మరణించిన సైనికుల్లో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి..

అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Follow us on

ఈ నెల 15న గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో  జరిగిన ఘర్షణల్లో మరణించిన సైనికుల్లో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆమె  ట్వీట్ చేశారు. జవాన్ల త్యాగానికి వెలకట్టలేమన్నారు. అమరులైన సైనికుల్లో ఈ రాష్ట్రానికి చెందిన సిపాయ్  రాజేష్ ఒరాంగ్, బిపుల్ రాయ్ ఉన్నారు. గాల్వన్ లోయలో ఇండో-చైనా సైనిక దళాల ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు మరణించగా.. తమవైపున ముప్పయ్ మంది మృతి చెందినట్టు చైనా అంగీకరించింది. అయితే పరిస్థితిని మరింత విషమించకుండా చూస్తామని ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ తమ ఫోన్ సంభాషణలో  స్పష్టం చేశారు.