Water Crisis: బెంగళూరును అతలాకుతలం చేస్తున్న నీళ్ల సంక్షోభం.. నెలకు 5 రోజులే స్నానం

|

Mar 14, 2024 | 8:53 AM

బెంగళూరులో నీటి ఎద్దడి ప్రతి చుక్క కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తక్కువ నీటితో తమ అవసరాలు తీర్చుకోవడానికి జనాలు రీసైక్లింగ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని ప్రాంతాల రోజువారీ సరఫరా కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. బెంగళూరు పరిస్థితిలో ఎలా ఉందంటే నెలకు కేవలం 5 రోజులే స్నానం చేయాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి.

Water Crisis: బెంగళూరును అతలాకుతలం చేస్తున్న నీళ్ల సంక్షోభం.. నెలకు 5 రోజులే స్నానం
Bengaluru Water Crisis
Follow us on

బెంగళూరులో నీటి ఎద్దడి ప్రతి చుక్క కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తక్కువ నీటితో తమ అవసరాలు తీర్చుకోవడానికి జనాలు రీసైక్లింగ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని ప్రాంతాల రోజువారీ సరఫరా కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. బెంగళూరు పరిస్థితిలో ఎలా ఉందంటే నెలకు కేవలం 5 రోజులే స్నానం చేయాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. అక్కడి పరిస్థితుల గురించి మీడియా కదిలించగా మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ‘‘గత రెండు నెలలుగా ఇది తీవ్రంగా దెబ్బతింది. రోజుకు నాలుగు ట్యాంకర్లు అవసరం. ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి. గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’ అని ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ వాటర్ రేట్లను నిర్ణయించాలని నగర పాలక సంస్థ ఆదేశించడం వల్ల ప్రయోజనం కలిగిందా అని ఒక నివాసిని ప్రశ్నించగా అధిక డిమాండ్ కారణంగా సకాలంలో ట్యాంకర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే నీటి ఎద్దడి కారణంగా పలు కంపెనీలో వర్క్ హోం హోం అఫర్ ను ఇస్తున్నాయి పలు కంపెనీలు. దేశంలోని ఎక్కువ మంది టెకీలు బెంగళూరులోనే ఉన్నారు. ఇప్పుడు నీటి వాడకాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లను పరిశీలిస్తున్నారు పలు కంపెనీలు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరెక్ట్ ఎంపిక అని, అయితే ప్రజలు వాస్తవానికి ఇళ్లకు వెళితేనే నీటి వినియోగం తగ్గుతుందని శ్రుతి అనే ఇంజనీర్ తెలిపారు.

ఇక నీళ్ల సమస్య గురించి మరో మహిళ మాట్లాడుతూ ‘మాకు ఒక బిడ్డ ఉంది, ఇది చాలా కష్టం. ట్యాంకర్లు రావడం లేదు. ప్రభుత్వం ధరలు తగ్గించినా అవి రావడం లేదు. అవి వచ్చినా నీళ్లు సరిపోవడం లేదు. ఇది ఎప్పుడు పరిష్కారమవుతుందో, ఎప్పుడు సాధారణ జీవితానికి తిరిగి వస్తుందో నాకు తెలియదు. భూగర్భ జలాలపై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఎప్పుడూ జరగలేదు. 15 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. ఇలాంటి చర్యలను ఏ ప్రభుత్వమూ చూడలేదని, తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారన్నారు. గత నెల రోజుల్లో తాను 5 సార్లు స్నానం చేశానని ఓ నివాసి చెప్పడం గమనార్హం.