Union Law Minister Kiren Rijiju Dance: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. తన సొంత రాష్ట్రం అరుణాచల్‌లో బుధవారం పర్యటించిన సందర్భంగా వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్ గ్రామానికి వచ్చారు. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు. స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుంటే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదుపుతూ చిందులు వేశారు. కళాకారుల నృత్యరూపానికి వంత పాడుతూ వారిలో మరింతి జోష్ పెంచారు.
ఈశాన్య రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామానికి చెందిన మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాట నృత్యంతో మంత్రిని ఘనంగా స్వాగతించారు. మంత్రి రిజిజు, ప్యాంటు, షర్ట్‌తో పాటు స్నీకర్‌లు ధరించి, గ్రామస్తులతో కాలు కదిలించి ఉల్లాసంగా పాల్గొన్నారు. స్థానిక కళాకారుల తాళాలు, డప్పుల దరుపుల మధ్య, కొద్దిమంది జనం ఉల్లాసంగా చప్పట్లు కొట్టడంతో మంత్రి సంప్రదాయ జానపద పాటలకు నృత్యం చేశారు. ఈ మేరకు ఆయన తన పర్యటనకు సంబంధించి వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి నేను అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లాను. అతిథులు వారి గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల సాంప్రదాయ ఆనందం ఇది. అసలైన జానపద పాటలు, నృత్యాలు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి సామాజిక వర్గానికి గుబాళింపును అందిస్తాయని వివరించారు.
During my visit to beautiful Kazalang village to monitor the Vivekananda Kendra Vidyalaya Projects. This is traditional merrymaking of Sajolang people whenever guests visit their village. The original folk songs and dances are the ESSENCE of every community in Arunachal Pradesh. pic.twitter.com/TTxor4nQJF
— Kiren Rijiju (@KirenRijiju) September 29, 2021
అరుణాచల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న రిజిజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత వీడియోల నుండి అతని నైపుణ్యాలను చాటుకునే వరకు, రిజిజు తన అనుచరులతో ఇవన్నీ పంచుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం, అతను తన అనుకూలీకరించిన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై “యువ తెలివైన అరుణాచల్ సివిల్ సర్వీస్ అధికారులను సంతోషపెట్టడానికి” ప్రముఖ సింగర్ కిశోర్ కుమార్ పాటను పాడారు.
“మా లా మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా మంచి డ్యాన్సర్! అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయం, అద్భుతమైన సంస్కృతిని చూడటం ఆనందంగా ఉంది” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
సైతం ప్రశంసించారు. కేవలం ప్రధాని మోడీ మాత్రమే కాదు, ట్విట్టర్ మొత్తం కేంద్రమంత్రి నృత్యంతో ఆకట్టుకుంది. “భారతదేశానికి చెందిన ఒక న్యాయ మంత్రి సంప్రదాయాన్ని కాపాడుకోవడం, తన హోదాను మరిచి సామాన్యుడిలా మారిపోవడం అందరిని కట్టిపడేసింది.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
— Narendra Modi (@narendramodi) September 30, 2021