Watch Video: కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. ఆ తర్వాత జరిగిందిదే? షాకింగ్ వీడియో..

కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌ సీటులోనే స్టీరింగ్‌ వదిలేసి కుప్పకూలిపోయాడు. ఆ పక్కనే ఉన్న కండక్టర్‌ వెంటనే గమనించి అప్రమత్తమవడంతో బస్సులో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మెరుపు వేగంతో కండక్టర్‌ చేతులతో బ్రేకులు వేశాడు..

Watch Video: కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. ఆ తర్వాత జరిగిందిదే? షాకింగ్ వీడియో..
Bus Driver Suffered Heart Attack During Driving

Updated on: May 25, 2025 | 11:05 AM

చెన్నై, మే 25: రోడ్డుపై వేగంగా కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌ సీటులోనే స్టీరింగ్‌ వదిలేసి కుప్పకూలిపోయాడు. ఆ పక్కనే ఉన్న కండక్టర్‌ వెంటనే గమనించి అప్రమత్తమవడంతో బస్సులో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మెరుపు వేగంతో కండక్టర్‌ చేతులతో బ్రేకులు వేసి బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సంఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మే 23 (శుక్రవారం) వెలుగు చూసింది.

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో శుక్రవారం ఉదయం పుదుకొట్టై వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు కనకంపట్టి దాటుతుండగా డ్రైవర్‌ ప్రభుకు గుండెపోటు వచ్చింది. డ్రైవర్‌ ప్రభు కండక్టర్‌ను పిలిచి, తనకు తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తోందని సంజ్ఞ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బస్సులో ఎవరూ ఆ సమయంలో డ్రైవర్‌ వైపు చూడలోదు. అంతలో ప్రభు స్పృహ కోల్పోయాడు. దీంతో అతడు సీటులోనే స్టీరింగ్‌ వదిలేసిన పక్కకు ఒరిగిపోయాడు. అక్కడే ఉన్న కండక్టర్‌ వెంటనే అప్రమత్తమై చేతులతో బస్సు బ్రేకులు నొక్కి కదులుతున్న బస్సును మెరుపువేగంతో ఆపాడు. సంఘటన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ త్వరిత చర్యతో పెను ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి

ఇంతలో మరికొందరు ప్రయాణికులు డ్రైవర్‌ వద్దకు చేరుకుని ఆయనను చేతులతో లేపారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న డ్రైవర్‌ ప్రభుకి ఫిట్స్‌ వచ్చింది. వెంటనే కండక్టర్‌ ఇనుపరాడ్డును డ్రైవర్‌ చేతుల్లో ఉంచాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే డ్రైవర్‌ ప్రభు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులోని సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.