Watch Video: క్లినిక్‌ డోర్‌ను లేటుగా తెరిచారని రెచ్చిపోయిన రోగి బంధువులు.. వైద్యుడు, అతని కొడుకుపై..

భోజనం చేసిన తర్వాత ఆలస్యంగా వైద్యశాలను తెరిచాడు. దీంతో కోపంతో రగిలిపోయిన రోగి బంధువులు ఇంట్లోకి ప్రవేశించి డాక్టర్, అతని కుమారుడిపై దాడి చేశారు.

Watch Video: క్లినిక్‌ డోర్‌ను లేటుగా తెరిచారని రెచ్చిపోయిన రోగి బంధువులు.. వైద్యుడు, అతని కొడుకుపై..
Maharashtra

Updated on: Sep 11, 2022 | 5:03 PM

Doctor Beaten by Group: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. క్లినిక్‌ను ఆలస్యంగా తెరిచినందుకు డాక్టర్‌, అతని కుమారుడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సంగవి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ యువరాజ్ గైక్వాడ్ ఇంట్లోనే వైద్యశాల నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం వేళ సమయానికి క్లినిక్‌ డోర్‌ తెరవలేదు. భోజనం చేసిన తర్వాత ఆలస్యంగా వైద్యశాలను తెరిచాడు. దీంతో కోపంతో రగిలిపోయిన రోగి బంధువులు ఇంట్లోకి ప్రవేశించి డాక్టర్, అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ సంఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. యువరాజ్ గైక్వాడ్ ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లినిక్ బయట వేచి ఉన్న రోగి బంధువులు ముందు తలపు కొట్టారు. డాక్టర్ భోజనం చేస్తుండటంతో తలుపు తీయలేదు. దీంతో వారు కోపంతో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. డాక్టర్ తలుపుతీయగానే.. రోగికి చెందిన కుటుంబసభ్యులు ఆనంద్ అలియాస్ అనిల్ జగ్తాప్, విశ్వజీత్ జగ్తాప్, అశోక్ జగ్తాప్, భూషణ్ జగ్తాప్ ఒక్కసారిగా క్లినిక్‌ గదిలోకి ప్రవేశించి డాక్టర్‌ గైక్వాడ్‌తోపాటు అతడి కుమారుడిపై దాడి చేశారు. ఈ సంఘటనతో ఆ ఇంట్లో ఉన్న మహిళలు భయాందోళన చెందారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

వీడియోలో రోగి బంధువులు డాక్టర్, అతని కుమారుడిపై దాడి చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైద్యుడిపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామని మాలెగావ్ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us