
బెంగళూరు, నవంబర్ 9: బెంగళూరు జైలులో సకలభోగాలు అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పలు తీవ్రమైన కేసుల్లో శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్తులు జైలులో తెగ ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. కొందరు దర్జాగా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతుంటే.. మరికొందరు ఎంచక్కా టీవీలు చూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ జైలులోని ఖైదీలు శిక్ష అనుభవిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీల లగ్జరీ లైఫ్‌కు సంబంధించిన దృశ్యాలు ఇవి.
ఈ వీడియోలో కనిపించిన ఖైదీల్లో 1996 నుంచి 2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేయడంతోపాటు వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేష్ రెడ్డి కూడ ఉన్నాడు. ఇతగాడికి కోర్టు తొలుత మరణశిక్ష విధించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అది 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉమేష్ రెడ్డి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ, టీవీలో ఐటెం సాంగ్ చూస్తూ కనిపించాడు. అతని వద్ద 2 ఆండ్రాయిడ్ ఫోన్లు, మరో కీ ప్యాడ్ మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. ఉమేష్ రెడ్డిని ఉంచిన సెల్‌లో LED టీవీ సదుపాయం కూడా ఉంది. ప్రముఖ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా ఇదే జైలులో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. అతడున్న జైలు గదిలో స్వయంగా వంట చేసుకునే సదుపాయం కూడా ఉంది. వీరివద్దనే కాదు ఇతర ఖైదీల వద్ద కూడా మొబైల్ ఫోన్లు ఉండటం విశేషం.
Terror suspects, smugglers, and rapists getting royal treatment in Bengaluru jail….. What kind of justice system is this?
Once again, shocking visuals have emerged from Parappana Agrahara Central Jail in Bengaluru, raising serious questions about the state of our prison… pic.twitter.com/5D4PfA73Gz
— Karnataka Portfolio (@karnatakaportf) November 8, 2025
కన్నడ నటుడు దర్శన్‌కు జైలు అధికారులు ప్రాథమిక సౌకర్యాలు నిరాకరించగా, ఇక్కడి చాలా మంది కరడుగట్టిన క్రిమినల్స్, రేపిస్టులకు మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా కటకటాల వెనుక విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. వీరితో పాటు ఐసిస్ ఉగ్రవాది జుహాద్ హమీద్ షకీల్‌కు చెందిన మరో వీడియో కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అతడు జైలు లోపల గాడ్జెట్‌లు, ఇతర సౌకర్యాలు యదేచ్ఛగా అనుభవిస్తున్నాడు. ఇలాంటి అతి ప్రమాదకరమైన ఖైదీలకు నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ గాడ్జెట్లు వినియోగించేందుకు అనుమతించడం జైలు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
అంతేనా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లోపల ఏర్పాటు చేసిన హైటెక్ సిగ్నల్ జామర్ల కారణంగా సదరు జైలు పరిసర ప్రాంతాల్లోని నివాసితుల మొబైల్ నెట్‌వర్క్ పని చేయడం లేదని నిత్యం కోకొల్లలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలు, సీరియల్ రేపిస్టులు, హంతకులు, నేరగాళ్లు మొబైల్ ఫోన్లు వినియోగించడం, దర్జాగా మొబైల్ ఫోన్‌ల అంతరాయం లేని నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నట్లు, సెల్‌ల లోపల HD నాణ్యత గల వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించారు.
Undated videos have surfaced showing jail inmates using mobile phones and watching TV inside #Bengaluru’s #ParappanaAgrahara Central Jail. pic.twitter.com/pFZK4rMR6l
— Hate Detector 🔍 (@HateDetectors) November 8, 2025
విజువల్స్‌లో కనిపిస్తున్న ఖైదీలు 2023 బ్యాచ్‌కు చెందినవారు. ఈ ఖైదీలు మొబైల్ ఫోన్‌లను ఎలా పొందారు? జైలు లోపలికి ఫోన్‌లను ఎవరు తీసుకువచ్చారు? ఖైదీలకు ఎవరు అప్పగించారు? వీడియోలు ఎలా రికార్డ్ చేశారు? వాటిని మీడియాకు ఎవరు ఇచ్చారు? అనే విషయాలపై సమగ్ర విచారణ జరిపి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలు సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
VIDEO | Karnataka: “I won’t tolerate it,” says Karnataka Home Minister G Parameshwara on reports of terrorists and criminals receiving VIP treatment in Bengaluru Central Jail.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/GxZ4R20Tjb
— Press Trust of India (@PTI_News) November 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.