Viral Video: వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన కోతికి సీపీఆర్‌ చేసిన కానిస్టేబుల్‌! వీడియో వైరల్

|

May 30, 2024 | 7:44 PM

వడదెబ్బ తగిలి అచేతనంగా పడిపోయిన ఓ కోతికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీస్‌ అధికారి. సొమ్మసిల్లిన కోతిని చేతిలోకి తీసుకుని సీపీఆర్‌ చేసి, ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. అనంతరం నీళ్లు తాగించి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఛతారీ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో మే 24న చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం..

Viral Video: వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన కోతికి సీపీఆర్‌ చేసిన కానిస్టేబుల్‌! వీడియో వైరల్
UP cop performs CPR on monkey
Follow us on

లక్నో, మే 30: వడదెబ్బ తగిలి అచేతనంగా పడిపోయిన ఓ కోతికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీస్‌ అధికారి. సొమ్మసిల్లిన కోతిని చేతిలోకి తీసుకుని సీపీఆర్‌ చేసి, ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. అనంతరం నీళ్లు తాగించి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఛతారీ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో మే 24న చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరాదిలో ప్రతి రోజూ 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బులందహర్‌లో ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయింది. ఛతారీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న వికాస్‌ తోమర్‌ అచేతనంగా పడిఉన్న కోతిని గమనించి, చేతిలోకి తీసుకుని వెంటనే సీపీఆర్‌ చేశాడు. వానరం ఛాతీపై నొక్కుతూ సీపీఆర్‌ చేసి దాన్ని బతికించాడు. స్పృహలోకి వచ్చిన కోతికి బాటిల్‌తో నీళ్లు పట్టించి, అనంతరం దాని శరీరం అంతా నీళ్లు పోసి చల్లబరిచాడు. కోతి స్పృహలోకి వచ్చిన తర్వాత పశువైద్యుడు డాక్టర్ హరి ఓం శర్మ దానికి యాంటీబయాటిక్‌ను అందించాడు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులు, కామెంట్లు రావడంతో నెట్టింట దూసుకుపోతుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ వికాస్‌ చేసిన పనిని అందరూ తెగ పొగిడేస్తున్నారు. దీనిపై హెడ్‌ కానిస్టేబుల్‌ వికాస్‌ మాట్లాడుతూ.. ‘అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేందుకు మేము శిక్షణ పొందాం. మనుషులు, కోతుల శరీరాలకు చాలా పోలికలు ఉంటాయి. ఆ పరిజ్ఞానంతోనే కోతికి సీపీఆర్‌ చేశాను. దాదాపు 45 నిమిషాల పాటు కోతి ఛాతిపై రుద్ది, నోట్లో నీరు పోయడంతో కోతి స్పృహలోకి వచ్చింది. చివరకు మా ప్రయత్నం ఫలించింది’ అంటూ వికాస్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.