ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఒక వీడియో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ట్రక్కు ముందు ఉన్న లైసెన్స్ ప్లేట్కు బంపర్‌కు మధ్య ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నా.. పట్టించుకోకుండా.. ట్రక్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాధితుల కేకలు, చుట్టుపక్కల వారి అరుపులను అసలు ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు వ్యక్తులను వారి ద్విచక్రవాహనాన్ని కూడా సుమారు అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే..
ఆగ్రాలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వాటర్ వర్క్స్ నుంచి రాంబాగ్ వైపు వెళుతుండగా ఒక ట్రక్కు డ్రైవర్ ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి దూరంగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమ బైక్ సహా ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయారు. ఈ విషయాన్నీ గుర్తించని ట్రక్ డ్రైవర్ అలా బైక్ ను ఇరుక్కున్న ఇద్దరు ప్రయాణీకులతో వెళ్తూనే ఉన్నాడు. ఇది చూసిన స్థానికులు డ్రైవర్ ను ట్రక్ ఆపమని అరుస్తున్నా వినిపించుకోలేదు. అలా దాదాపు ఆ ట్రక్ ను వెంబడించి అర కిలోమీటర్ ఈడ్చుకెల్లిన తర్వత స్థానికులు డ్రైవర్‌ను ట్రక్కు ఆపమని బలవంతం చేసి.. వాహనంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను బయటకు తీశారు.
In Agra, a truck driver first hit a bike rider and then tried to run away, Both the motorcycle and the young man were trapped in the fleeing truck The truck driver dragged both the youths for several meters
pic.twitter.com/TblOQGl9Gq— Ghar Ke Kalesh (@gharkekalesh) December 24, 2024
డ్రైవర్‌ను చుట్టుపక్కల వారు కొట్టారు. అంతేకాదు ట్రక్ డ్రైవర్ ని పట్టుకున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ని అరెస్ట్ చేసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆగ్రాలోని చట్టా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌బాగ్ క్రాసింగ్ సమీపంలో యమునా నదిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP-చట్టా సర్కిల్) హేమంత్ కుమార్ వీడియో ఆగ్రాలోని ట్రాన్స్ యమునా ప్రాంతానికి చెందినదని, ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టినట్లు ధృవీకరించారు. కంటెయినర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. గాయపడిన ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ట్రక్ డ్రైవర్‌ను ఫిరోజాబాద్‌కు చెందిన దీపక్‌గా గుర్తించగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న వారిని ఆగ్రాకు చెందిన జాకీర్, రబ్బీగా గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..