Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు… విద్యార్థుల టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా

తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. తమిళానికి దగ్గరగా ఉండే వైరల్ థాయ్ పాటను ఆలపించడం ద్వారా నెటిజన్స్‌ మనసులను గెలుచుకున్నారు. మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్, మిడిల్ స్కూల్, థెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన ఈ వీడియోలో...

Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు... విద్యార్థుల టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా
School Students Group Dance

Updated on: Apr 09, 2025 | 8:55 PM

తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. తమిళానికి దగ్గరగా ఉండే వైరల్ థాయ్ పాటను ఆలపించడం ద్వారా నెటిజన్స్‌ మనసులను గెలుచుకున్నారు. మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్, మిడిల్ స్కూల్, థెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన ఈ వీడియోలో, పిల్లలు హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ, నృత్యం చేస్తున్నట్లు కనపడుతుంది.

ఆ అందమైన వీడియోలో, కొంతమంది అమ్మాయిలు, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ ఉంటారు. తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నువ్వు నా తమ్ముడిని చూశావా? నాన్నను అడిగావా?) అనే పాటను పాడుతూ కనిపించారు. థాయ్ లిరిక్స్ కూడా తమిళం సాంగ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో పిల్లు చాలా ఈజీగా పాడుతూ ఎంజాయ్‌ చేశారు. పిల్లలు స్కూల్ యూనిఫాంలు ధరించి, ఆత్మవిశ్వాసంతో పదాలను మంచి ఉచ్చారణతో పాడారు.

వైరల్ అయిన క్షణం పాట గురించి మాత్రమే కాదు. పిల్లల ఉత్సాహం, ఆనందం ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా చిన్న శివదర్శిని ముఖం తనకు తెలియకుండానే వెలిగిపోయింది. శివదర్శినిని ప్రదర్శించే మరో వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్స్‌ వీడియోలను ఎంతో లైక్‌ చేస్తున్నారు. “వారు మినియన్స్‌లా కనిపిస్తున్నారు” అని ఒక యూజర్ అన్నారు. ఈ వీడియో చాలా అందంగా ఉందని మరొకరు కామెంట్‌ చేశారు. ఈ వీడియో చూస్తుంటే మళ్లీ స్కూల్‌ డేస్‌లోకి వెళితే బాగుండు అని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

 

వీడియో చూడండి: