Viral Video: వద్దని చెప్పినా వినలేదు.. వెళ్లారు చిక్కుల్లో పడ్డారు.. అసలు ఏం జరిగిందంటే?

ఎక్కడపడితే అక్కడ స్టంట్స్‌ చేస్తే ఇలానే ఉంటుంది. రోడ్డు మీద చేయాల్సిన స్టంట్స్‌ బీచ్‌లో చేసి కొందరు యువకులు ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఖరీదైన బెంజ్‌కార్‌తో బీచ్‌లో ప్రమాదకరమైన స్టంట్స్‌ చేశారు. తీరా బెడిసికొట్టడంతో వాళ్ల కారు సముద్రం ఒడ్డున ఇసుకలో చిక్కుకుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు వాళ్ల తెగ తంటాలు పడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.

Viral Video: వద్దని చెప్పినా వినలేదు.. వెళ్లారు చిక్కుల్లో పడ్డారు.. అసలు ఏం జరిగిందంటే?
Car Stunt

Updated on: Jul 22, 2025 | 10:50 AM

కొందరు యువకులు ఖరీదైన బెంజ్‌ కారుతో బీచ్‌టో స్టంట్స్‌ చేస్తుండగా అదుపుతప్పి కారు సముద్రపు ఒడ్డుకు దూసుకెళ్లి నీటిలో ఇరుక్కున్న ఘటన సూరత్‌లోని డ్యూమాస్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగవైరల్‌గా మిగిలింది. వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. సూరత్‌లోని డ్యూమాస్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు కొందరు యువకులు బెంజ్​ కారులో వచ్చారు. అయితే బీచ్​ దగ్గర వరకు కార్లకు ఎంట్రీ లేదని అధికారులు చెప్పినా వాళ్లు వినకుండా.. నిబంధనలను ఉల్లంఘించి తమ వాహనాన్ని బీచ్‌లోకి తీసుకెళ్లారు. అయితే నిజానికి వాళ్లు అక్కడ స్టంట్‌ చేసేందుకు కారును లోపలికి తీసుకెళ్లినట్టు సమాచారం.

అయితే అనుకున్న ప్రకారం కారును బీచ్‌లోకి తీసుకెళ్లిన యువకులు అక్కడ దానితో స్టంట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాళ్ల బెంజ్‌ కారు నది ఒడ్డున ఇసుకలో చిక్కుకుపోయింది. కారు సగానికి పైగా నీట మునిగింది. ఆ కారును బయటకు తీసేందుకు సదురు యువకులు పడరాని పాట్లు పడ్డారు. దాని టైర్లకు మట్టిని క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీని గమనించిన కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

వీడియో చూడండి.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు బీచ్‌లోకి కారును తీసుకెళ్లిన నట్టు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదీ.. వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు..అనే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.