Viral Video: ఓర్నాయనో.. లొట్టలేసుకుంటూ తినే అప్పడాలు ఇలా తయారు చేస్తారా? కడుపులో తిప్పేస్తుంది

|

Mar 17, 2024 | 7:58 PM

ఇండియన్‌ ఫుడ్‌ అంటే రకరకాల కూర‌లు, పిండి వంటలు, ఆవకాయి, బిర్యానీ నుంచి టేస్టీ స్ట్రీట్ స్నాక్స్‌ వ‌ర‌కూ ఎంతో వైవిధ్యభ‌రితంగా ఉంటాయి. మన పాకశాస్త్రానికి దేశ నలుమూలలా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక వీటి తయారీ కూడా వినూత్నంగా ఉంటుంది. అయితే వీటిల్లో కొన్ని వంట‌కాల త‌యారీ ప‌ద్ధతులు విచిత్రంగా ఉంటే మ‌రికొన్నేమో సందేహాలు రేకెత్తించేలా ఉంటాయి. ఇక శుభకార్యాలు, తెలుగింటి భోజనాల్లో పాప‌డ్స్‌ (అప్పడాలు) తప్పనిసరి..

Viral Video: ఓర్నాయనో.. లొట్టలేసుకుంటూ తినే అప్పడాలు ఇలా తయారు చేస్తారా? కడుపులో తిప్పేస్తుంది
Courtesy: dabake_khao instagram
Follow us on

ఇండియన్‌ ఫుడ్‌ అంటే రకరకాల కూర‌లు, పిండి వంటలు, ఆవకాయి, బిర్యానీ నుంచి టేస్టీ స్ట్రీట్ స్నాక్స్‌ వ‌ర‌కూ ఎంతో వైవిధ్యభ‌రితంగా ఉంటాయి. మన పాకశాస్త్రానికి దేశ నలుమూలలా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక వీటి తయారీ కూడా వినూత్నంగా ఉంటుంది. అయితే వీటిల్లో కొన్ని వంట‌కాల త‌యారీ ప‌ద్ధతులు విచిత్రంగా ఉంటే మ‌రికొన్నేమో సందేహాలు రేకెత్తించేలా ఉంటాయి. ఇక శుభకార్యాలు, తెలుగింటి భోజనాల్లో పాప‌డ్స్‌ (అప్పడాలు) తప్పనిసరి. వీటిని కొందరు మగువలు ఇళ్లలోనే త‌యారుచేస్తే.. మరికొందరేమో మర్కెట్లో దొరికేవి తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ఓ వీడియోలో అప్పడాలు తయారు చేస్తున్న వీడియో ఒకటి తెగ వైర‌ల‌వుతోంది. అందులో ఓ మహిళ పాప‌డ్ తయారీ చేస్తున్న విధానం చూసి నెటిజన్లు దాదాపు వాంతి చేసుకున్నంత పని చేస్తున్నారు. అసలింతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..

ఓ మహిళ అప‌రిశుభ్రత‌ వాతావరణంలో అప్పడాలు తయారు చేస్తున్న విధానం చూసి వీక్షకులు కంగుతింటున్నారు. సాధారణంగా అప్పడాలు పప్పు, బియ్యం, బంగాళా దుపలు వంటి వాటితో తయారు చేస్తుంటారు. అయితే ఈ వీడియో ఓ మ‌హిళ పాప‌డ్స్ త‌యారుచేయ‌డం పిండిని క‌ల‌ప‌డంతో మొద‌ల‌వుతుంది. వేడి స్కెల్లెట్‌పై పిండి పలుచగా పోస్తుంది. అది ఆరిపోయిన తర్వాత వస్త్రం మాదిరి మెత్తగా తయారవుతుంది. ఇలా తీసిన పాపడ్‌ షీట్స్‌ అన్నింటినీ ఒకదానిపై ఒకటి ఉంచి.. వాటన్నింటినీ నేలపై ఉంచుతుంది. ఆ తర్వాత గుండ్రటి గిన్నే తీసుకుని పాపడ్‌ షీట్స్‌పై పెట్టి, అపరి శుభ్రంగా ఉన్న కాళ్లతో గిన్నెపై నిలబడి గట్టిగా నొక్కుతుంది. ఇలా ఆమె కాళ్లతో తొక్కి గుండ్రటి ఆకారంలో క‌ట్ చేస్తుంది. ఆపై వాటిని విడ‌దీసి ఎండ‌లో ఆరబెట్టి, ఆరిన తర్వాత ప్యాక్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒట్టి కాళ్లతో పాప‌డ్‌ను ప్రెస్ చేయ‌డం, అపరిశుభ్రంగా ఉన్న స్థలంలో ఎండలో ఆరబెట్టడం.. ఈ ప్రక్రియ మొత్తం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. అపరిశుభ్ర వాతావ‌ర‌ణంలో పాప‌డ్స్ త‌యారు చేస్తారా?అంటూ కొందరు మండిపడుతుంటే.. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ కంటే ఇది మేలు. హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇంకా మెరుగ్గా ఉందని మ‌రికొంద‌రు సర్దుకుపోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.