Viral Video: ‘మంత్రి కడిగిన పాదము..!’ రోడ్డుపై బురదకాళ్లతో నిలబడిన వ్యక్తి కాళ్లను శుభ్రం చేసిన మంత్రి

విద్యుత్‌ శాఖ మంత్రి ప్రద్యుమ్న్‌ సింగ్‌ సోమవారం (జనవరి 16) ఓ పౌరుడి పాదాలను కడిగారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న మంత్రి రోడ్డు దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో రోడ్లు సరిగ్గా లేనందుకు ప్రజలకు క్షమాపణలు..

Viral Video: మంత్రి కడిగిన పాదము..! రోడ్డుపై బురదకాళ్లతో నిలబడిన వ్యక్తి కాళ్లను శుభ్రం చేసిన మంత్రి
Viral Video

Updated on: Jan 18, 2023 | 8:07 AM

మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి ప్రద్యుమ్న్‌ సింగ్‌ సోమవారం (జనవరి 16) ఓ పౌరుడి పాదాలను కడిగారు. గ్వాలియర్‌లో పర్యటిస్తున్న మంత్రి రోడ్డు దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో రోడ్లు సరిగ్గా లేనందుకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాదాలకు బురద ఉండటం గమనించిన మంత్రి, నీళ్లుపోసి చేతులతో అతని పాదాలను కడిగారు. త్వరలోనే కొత్త రోడ్లు వేయిస్తానని హామీ కూడా ఇచ్చారు.

కాగా మంగళవారం రాత్రి మంత్రి సెక్టార్ 2లో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారు గుంతల మయమైన రోడ్డుపై ఉన్న బురదలో కూరుకుపోయింది. దీంతో చుట్టూ ఉన్న స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించగా.. మంత్రి కూడా కారు దిగి వచ్చి తన కారును స్వయంగా తోశారు. ఇక ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి స్టంట్‌లు చేయడం కొత్తేమీ కాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.