Viral Video: కత్తితో నడిరోడ్డుపై రెచ్చిపోయిన దుండగుడు.. పోలీసులపైనా దాడికి ప్రయత్నం

|

Feb 07, 2023 | 9:38 AM

సూపర్ మార్కెట్ ప్రాంతంలో నిందితుడు కత్తితో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడని, వారిపై దాడికి యత్నించాడని కలబురగి సిటీ పోలీస్ కమిషనర్ చేతన్ ఆర్ తెలిపారు. అతడిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అతడు దాడిచేశాడని పేర్కొన్నారు

Viral Video: కత్తితో నడిరోడ్డుపై రెచ్చిపోయిన దుండగుడు.. పోలీసులపైనా దాడికి ప్రయత్నం
Karnataka News
Follow us on

ఓ వ్యక్తి నడివీధిలో కత్తితో హల్‌చల్‌ చేశాడు. స్థానికులకు కత్తి చూపిస్తూ బెదిరిస్తూ నానా హంగామా చేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆ దుండగుడు. పోలీసులపై కూడా కత్తిదూస్తూ దాడికి యత్నించాడు. దాంతో స్థానికులు మరింత ఆందోళన చెందారు. చివరికి పోలీసులు దుండగుడిని అదుపుచేసే క్రమంలో అతని కాళ్లపై కాల్పులు జరిపారు. దెబ్బకు దుండగుడు కుప్పకూలిపోయాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని కలబురగి ప్రాంతంలో జరిగింది.

సూపర్ మార్కెట్ ప్రాంతంలో నిందితుడు కత్తితో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడని, వారిపై దాడికి యత్నించాడని కలబురగి సిటీ పోలీస్ కమిషనర్ చేతన్ ఆర్ తెలిపారు. అతడిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అతడు దాడిచేశాడని పేర్కొన్నారు. దీంతో స్వీయరక్షణతోపాటు ప్రజల రక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపినట్టు వివరించారు.

ఇవి కూడా చదవండి

కాగా నిందితుడిని జాఫర్‌గా గుర్తించామని, కాళ్లకు తూటా గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..