Viral Video: రోడ్లు గుంతల మయం, నిలిచిన వరదనీరు.. కూతురు పడిందని తండ్రి వినూత్న నిరసన

దేశంలో అనేక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలు వరదలతో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల పెద్ద గుంతలు పడ్డాయి. అందులో నీరు నిల్వ ఉండడంతో పాదచారుల పరిస్థితి దయనీయంగా ఉంది. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్డుకి సమీపంలో అనేక పాఠశాలలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లేందుకు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఈ రోజు విద్యార్థి రోడ్డుపై నీటితో నిండిన గుంతలో పడిపోయింది. అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. దీంతో ఆ స్టూడెంట్ తండ్రి ఒక చాప, దిండు తీసుకొని రోడ్డుపై నీటితో నిండిన పెద్ద గుంతలో పడుకుని భారతమతాకి జై అంటూ నిరసన తెలిపాడు.

Viral Video: రోడ్లు గుంతల మయం, నిలిచిన వరదనీరు.. కూతురు పడిందని తండ్రి  వినూత్న నిరసన
Kanpur Man Protest

Updated on: Aug 04, 2025 | 2:43 PM

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో సోమవారం ఒక వ్యక్తి తన కుమార్తె గుంతలున్న రోడ్డుపై పడింది. స్కూల్ కి వెళ్ళే మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో .. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని నిరసిస్తూ.. ఆ స్టూడెంట్ తండ్రి నీటితో నిండిన పెద్ద గుంతలో చాప, దిండు వేసుకుని పడుకున్నాడు.

ఆనంద్ సౌత్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. నెలల తరబడి రోడ్డు ఇలాంటి దుస్తితిలోనే ఉందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక వార్డు కౌన్సిలర్, ఎమ్మెల్యే, మంత్రులతో సహా అధికారులకు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, మరమ్మతు పనులను ఇప్పటికీ చేపట్టలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తన కూతురు నీటిలో పడిపోవడంతో ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తండ్రి “భారత్ మాతా కీ జై” అని నినాదాలు చేస్తూ.. నీటిలో పడుకుని నిరసన తెలుపుతున్నాడు. నీటితో నిండిన, గుంటలుతో ఉన్న రోడ్ల వల్ల రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎవరొకరు గాయపడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు, స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాము పడుతున్న ఇబ్బంది అధికారుల దృష్టికి చేరుకునేందుకు ఈ విధంగా నిరసన చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి చెప్పాడు.

“నెలలుగా రోడ్డు నిర్మించలేదు. కౌన్సిలర్, మంత్రి, ఎమ్మెల్యే లతో పాటు చాలా అధికారులతో తమ సమస్యని చెప్పాము. ఎవరూ మాటని వినడం లేదు. మేము ఏమి చేయాలి,” అని ఆ వ్యక్తి గుంతలో పడుకున్న వ్యక్తి చెప్పారు. పిల్లలు ఈ రోడ్డుమీద నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. ఈ రోజు నా కూతురు జారిపడింది. రేపు మరొకరు పడవచ్చు.. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ రోడ్డుమీదనే వెళ్తారు అని అతను జోడించిమరీ చెప్పారు.

వర్షాకాలంలో ఈ రోడ్డు దాదాపుగా నిరుపయోగంగా మారిందని, వాహనాలు చెడిపోవడం, సైక్లిస్టులు పడిపోవడం, పిల్లలు పాఠశాలకు చేరుకోవడానికి మోకాళ్లలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..